Samantha: చివరికి అతనికి అడ్డంగా బుక్కైన హీరోయిన్ సమంత..!

సౌత్ ఇండియా లో టాప్ మోస్ట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోయిన్స్ లిస్ట్ తీస్తే అందులో సమంత పేరు ముందు వరుసలో ఉంటుంది. ఈమెకి ఉన్న క్రేజ్ ని చూస్తే ఎవ్వరైనా షాక్ అవ్వాల్సిందే. ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న మీడియం రేంజ్ స్టార్ హీరోలందరికంటే సమంత కి ఉన్న మార్కెట్ ఎక్కువ. విలక్షణమైన పాత్రలు పోషిస్తూ ఆమె ఈ స్థాయికి చేరుకుంది.

అయితే నాగ చైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత సమంత ఎన్నో సవాళ్ళను ఎదురుకున్న సంగతి మన అందరికీ తెలిసిందే. సోషల్ మీడియా లో నెగటివిటీ ని ఎదురుకుంది, ఎన్ని విమర్శలు తనపై వచ్చినా భరించి నిలబడింది. ఇదంతా పక్కన పెడితే మయోసిటిస్ అనే ప్రాణాంతక వ్యాధి సోకి, ఆమె ఎంత ఇబ్బందికి గురి అయ్యిందో మనమంతా చూస్తూనే ఉన్నాం. ఎలాగో అలా ఆమె కోలుకొని షూటింగ్స్ ని పూర్తి చేసిన సంగతి అందరికీ తెలిసిందే.

రీసెంట్ గానే ఆమె చివరి దశ మయోసిటిస్ ట్రీట్మెంట్ తీసుకోవడానికి అమెరికా కి వెళ్ళింది. ఈ ట్రీట్మెంట్ కి చాలా రోజుల సమయం పడుతుందని అందరూ అనుకున్నారు. కానీ సమంత నేడు తెల్లవారు జామున ముంబై విమానాశ్రయం లో దర్శనమిచ్చి అందరిని షాక్ కి గురి చేసింది. అదేంటి సమంత అప్పుడే ఇండియా కి వచ్చేసింది. ట్రీట్మెంట్ అయిపోయిందా అని సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

ట్రీట్మెంట్ అయ్యాకే ఆమె ఇండియా కి తిరిగి వచ్చిందా, లేదా ఏదైనా ముఖ్యమైన పని మీద ఇండియా కి వచ్చిందా అనే విషయం తెలియాల్సి ఉంది. అయితే ఆమె విమానాశ్రయం దిగగానే కమలేష్ అనే ఫోటోగ్రాఫర్ ని చూసి పరుగులు తీసింది. కానీ అతను సమంత ని పట్టుకొని ఫోటోలు తీసుకున్నాడు. మిమల్ని తప్పించుకొని ఇటు వచ్చేసాను అని అనుకున్నాను, కానీ ఇలా దొరికిపోయాను ఏంటి అంటూ సమంత క్యూట్ గా మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus