హిట్టు ప్లాపులతో సంబంధం లేకుండా, తనదైన స్టైల్‌లో దూసుకెళ్తున్న హీరో శ్రీవిష్ణు. సినిమాలతో ఎప్పుడూ వార్తల్లో ఉండే ఆయన, ఇప్పుడు తన ఫ్యామిలీ ఫోటోలతో సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాడు. ముఖ్యంగా, ఆయన కూతురిని చూసి నెటిజన్లు సర్‌ప్రైజ్ అవుతున్నారు.శ్రీ విష్ణు కూతురు పేరు మిద్రా. ఇటీవల ఆమె హాఫ్ శారీ ఫంక్షన్ చాలా గ్రాండ్‌గా జరిగింది.
ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఇప్పుడు ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడుతున్నాయి. లంగా ఓణీలో మిద్రా అచ్చం దేవకన్యలా ఉందని ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు. “మన హీరోకి ఇంత పెద్ద కూతురు ఉందా?” అంటూ చాలామంది ఆశ్చర్యపోతున్నారు. శ్రీ విష్ణు భార్య ప్రశాంతితో కలిసి ఉన్న ఈ ఫ్యామిలీ ఫోటోలు అందరినీ ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.
శ్రీవిష్ణు కెరీర్ ప్రస్తుతం ఫుల్ స్వింగ్‌లో ఉంది. రెగ్యులర్ కథలకు దూరంగా, ‘మెంటల్ మదిలో’, ‘బ్రోచేవారెవరురా’, ‘రాజ రాజ చోర’ లాంటి వెరైటీ సినిమాలతో తనకంటూ ఓ బ్రాండ్ క్రియేట్ చేసుకున్నాడు. ఇక ‘సామజవరగమన’తో తన కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్ కొట్టి, ఏకంగా 50 కోట్ల క్లబ్‌లో చేరిపోయాడు. ఆ వెంటనే ‘ఓం భీమ్ బుష్’తో మరో సక్సెస్ అందుకున్నాడు.
2025 లో ‘సింగిల్’ సినిమాతో బాగానే అలరించాడు.ప్రస్తుతం ‘మృత్యుంజయ్’ తో పాటు తన 19 వ ప్రాజెక్టు అలాగే ఇతర సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న శ్రీవిష్ణు, ఓవైపు కెరీర్‌ను, మరోవైపు ఫ్యామిలీ లైఫ్‌ను పర్ఫెక్ట్‌గా బ్యాలెన్స్ చేస్తున్నాడు. అందుకే ఆయనను ఫ్యాన్స్ ‘ఫ్యామిలీ మ్యాన్’ అని పిలుస్తున్నారు.