Spirit: అభిరామ్ ‘యాటిట్యూడ్’ సందీప్‌కు నచ్చిందా?

ప్రభాస్ ‘స్పిరిట్’.. ప్రస్తుతం ఇండియన్ సినిమాలో ఇదే హాటెస్ట్ ప్రాజెక్ట్. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో వస్తున్న ఈ పోలీస్ డ్రామాలో చిన్న పాత్ర దొరికినా చాలని ఇండస్ట్రీ మొత్తం ఎదురుచూస్తోంది. ఏకంగా మంచు విష్ణు “నాకు ఛాన్స్ ఇవ్వండి” అని బహిరంగంగా లేఖ రాశాడంటేనే.. ఈ సినిమాపై క్రేజ్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.

ఇంత టఫ్ కాంపిటీషన్ నడుమ, ఇప్పుడు ఒక షాకింగ్ పేరు తెరపైకి వచ్చింది. ఆయనే దగ్గుబాటి అభిరామ్. ‘అహింస’ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చి, భారీ డిజాస్టర్ మూటగట్టుకున్న అభిరామ్‌ను సందీప్ వంగా ఓ కీలక పాత్ర కోసం ఎంపిక చేశాడని ఫిల్మ్ నగర్‌లో గట్టిగా టాక్ నడుస్తోంది.

Spirit

‘అహింస’ ఫ్లాప్ తర్వాత పూర్తిగా సైలెంట్ అయిన అభిరామ్‌ను సందీప్ ఎందుకు పిలిచాడు? అనే ప్రశ్నకు, ఇండస్ట్రీ వర్గాల్లో ఓ ఆసక్తికరమైన గాసిప్ వినిపిస్తోంది. ‘స్పిరిట్’లో ఓ పాత్రకు చాలా ‘యాటిట్యూడ్’, ‘యారోగెన్స్’ (పొగరు) కావాలట. అభిరామ్ రియల్ లైఫ్ క్యారెక్టర్ గురించి బయట ఇలాంటి ప్రచారమే ఉంది. అతనిలోని ఆ ‘యారోగెన్స్’ నచ్చే సందీప్ ఈ పాత్రకు పిలిచాడని అంటున్నారు.

సందీప్ ఎప్పుడూ స్టార్లను చూసి ఛాన్స్ ఇవ్వడు. ‘యానిమల్’కు బాబీ డియోల్‌ను, ‘స్పిరిట్’కు వివేక్ ఒబెరాయ్‌ను ఎంచుకున్నాడంటేనే అతని జడ్జిమెంట్ అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు అభిరామ్‌లోని ఆ యాటిట్యూడ్‌నే నమ్మి, దాన్ని స్క్రీన్‌పై స్టైలిష్‌గా చూపించాలని ఫిక్స్ అయ్యాడట.

‘అహింస’ తర్వాత పూర్తిగా అడ్రస్ లేని అభిరామ్‌కు, ఒకవేళ ఈ వార్త నిజమైతే, ఇది జాక్‌పాట్ తగిలినట్లే. బడా స్టార్లు వెయిట్ చేస్తుంటే, సందీప్ పిలిచి మరీ ఫ్లాప్ హీరోకి ఛాన్స్ ఇచ్చాడంటే, అది అభిరామ్ కెరీర్‌కే అతిపెద్ద టర్నింగ్ పాయింట్ అవుతుంది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus