Rishab Shetty: ‘కాంతార చాప్టర్ 1’ సెట్స్ లో రిషబ్ శెట్టి ఫ్యామిలీ కష్టాలు

ఒక ఫోటో… ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది. ‘కాంతార: చాప్టర్ 1’ కోసం రిషబ్ శెట్టి ఎంత కష్టపడ్డాడో అందరికీ తెలుసు. కానీ, ఆ కష్టం వెనుక ఆయన కుటుంబం మొత్తం ఉందని చెప్పేందుకు ఈ ఒక్క ఫోటో చాలు. ఈ సినిమా కోసం రిషబ్ ఫ్యామిలీ మొత్తం ఎంత కష్టపడిందో ఎన్టీఆర్ చెప్పిన మాటలు ఇప్పుడు ఈ ఫోటోతో నిజమనిపిస్తున్నాయి.

Rishab Shetty

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ ఇమేజ్‌ను గమనిస్తే, పైన రిషబ్ శెట్టి తన భార్య ప్రగతి, పిల్లలతో నవ్వుతూ ఉన్న అందమైన ఫ్యామిలీ ఫోటో ఉంది. కింద ఉన్న రెండు ఫోటోలు ‘కాంతార’ సినిమాలోనివి. అందులోని ఓ యాక్షన్ సీన్‌లో కనిపిస్తున్న మహిళ, పిల్లాడు.. అచ్చం రిషబ్ భార్య, కొడుకు రన్విత్‌లాగే ఉన్నారు. దీంతో, సినిమాలో వాళ్లు కూడా యాక్ట్ చేశారా? లేక డూప్‌గా నటించారా?

అనే చర్చ మొదలైంది. ఏదేమైనా, సినిమా కోసం వాళ్లు సెట్స్‌లోనే ఉన్నారని ఈ ఫోటో క్లియర్‌గా చెబుతోంది.’కాంతార: చాప్టర్ 1′ కేవలం ఒక సినిమా కాదు, అదొక యజ్ఞంలా సాగింది. ఈ విషయం రిషబ్ ఫ్యామిలీని చూస్తేనే అర్థమవుతుంది. ఈ సినిమా షూటింగ్ కోసం రిషబ్ శెట్టి ఏకంగా ఐదేళ్ల పాటు తన ఫ్యామిలీతో బెంగళూరు నుంచి కుందాపుర అనే ఊరికి మకాం మార్చాడు.

పిల్లలకు దూరంగా ఉండటం ఇష్టం లేక, తనతో పాటే సెట్స్‌కు తీసుకొచ్చాడు. వాళ్ల చదువులు దెబ్బతినకుండా అక్కడి లోకల్ స్కూళ్లలోనే చేర్పించాడు.రిషబ్ భార్య ప్రగతి శెట్టి కేవలం ఫ్యామిలీని చూసుకోవడమే కాదు, ఈ సినిమాకు కాస్ట్యూమ్ డిజైనర్‌గానూ పనిచేసింది. పిల్లల చదువులు, ఇంటి పనులు, సినిమా పనులు.. అన్నింటినీ ఆమె దగ్గరుండి చూసుకుంది. వారందరి కష్టం ఫలించి, ఈ సినిమా రూ.850 కోట్లు వసూలు సూపర్ హిట్ గా నిలిచింది.

కల్ట్ క్లాసిక్ ‘శివ’.. ఆ టాప్ 10 లిస్ట్‌లోకి వస్తుందా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus