శర్వానంద్ కంటే సమంత రెమ్యూనరేషనే ఎక్కువంట

ఆల్రెడీ పెళ్ళాయక వరుస విజయాలు అందుకొని “పెళ్ళైన హీరోయిన్లు సినిమాల్లో నెగ్గుకురాలేరు” అనే నానుడిని బ్రేక్ చేసిన సమంత ఇప్పుడు టాలీవుడ్, కోలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అయిపోయింది. ప్రస్తుతం తమిళంలో రెండు సినిమాలు, తెలుగులో భర్త నాగచైతన్యతో కలిసి “మజిలీ” సినిమాలు చేస్తూ యమ బిజీగా ఉన్న సమంత తాజాగా “96” సినిమా రీమేక్ ను ఒకే చేసింది. శర్వానంద్ కథానాయకుడిగా తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని తమిళ వెర్షన్ కు దర్శకత్వం వహించిన ప్రేమ్ కుమార్ తెరకెక్కించనుండగా.. దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మార్చి నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలవ్వానుండగా.. ప్రస్తుతం ప్రీప్రొడక్షన్ వర్క్ శరవేగంగా జరుగుతోంది.

అయితే.. ఈ సినిమాకి హీరో శర్వానంద్ తీసుకొనే రెమ్యూనరేషన్ కంటే దాదాపు 30% ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకొంటోందట సమంత. నిజానికి శర్వాతో కంపేర్ చేస్తే సమంత ఈ సినిమాకి కేటాయించిన డేట్స్ తక్కువ. అలాంటిది శర్వా కంటే ఎక్కువ పారితోషికం తీసుకోనుండడం చర్చనీయాంశం అయ్యింది. హీరోల కంటే హీరోయిన్ల రెమ్యూనరేషన్ ఎప్పుడు తక్కువే.. కానీ మొట్టమొదటిసారిగా హీరో కంటే ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకొంటూ సమంత సరికొత్త రికార్డ్ ను క్రియేట్ చేస్తోంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus