ఒకే నెలలో మూడు చిత్రాలను కంప్లీట్ చేసిన సమంత..!

మొదటి చిత్రం నుంచి సమంత వృత్తి పట్ల అంకితభావంతో ఉంటారు. ఎప్పుడు షూటింగ్ కి ఆలస్యంగా వచ్చినట్లు దర్శకనిర్మాతలు కంప్లైంట్ ఇచ్చిన దాఖలాలు లేవు. ఆమె స్టార్ నటిగా ఎదిగిన తర్వాత కూడా డెడికేషన్ తో ఉన్నారు. పెళ్లి అయిన తర్వాత, అక్కినేని ఇంటి కోడలిగా మారిన తర్వాత డెడికేషన్ మరింత పెరిగింది. వ్యక్తిగత జీవితానికి సమయాన్ని తగ్గించి. ప్రొఫిషనల్ లైఫ్ కి ఎక్కువ సమయం కేటాయిస్తోంది. ఎండలను సైతం లెక్కచేయకుండా ఈ నెలలో మూడు సినిమాలను కంప్లీట్ చేసింది. ముందుగా విశాల్ సరసన చేస్తున్న తమిళ సినిమా `ఇరుంబు థిరై` షూటింగ్‌ను ని సమంత (Samantha) పూర్తి చేసింది.

రీసెంట్ గా  మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్‌, డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కిన “రంగస్థలం” సినిమాలో సమంత తన పాత్రకు సంబంధించిన షూటింగ్ ని ఈనెలలోనే కంప్లీట్ చేసింది. ఈ మూవీ మార్చి 30 న రిలీజ్ కానుంది. ఇక తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతోన్న “మహానటి” షూటింగ్ ని నిన్ననే కంప్లీట్ చేసింది. ఆ విషయాన్నీ సోషల్ మీడియా వేదికపై వెల్లడించింది. మహానటి సావిత్రి జీవితకథ ఆధారంగా డైరెక్టర్ నాగ్ అశ్విన్ రూపొందిస్తున్న ఈ సినిమాలో తన పాత్రపై క్లాప్ ఇస్తున్న ఫోటోని షేర్ చేస్తూ వివరించింది. ఈ ఫోటో తో సమంత జమున పాత్ర కాదు మధురవాణి అనే జర్నలిస్ట్ పాత్రలో కనిపించనుందని అందరికీ అర్ధమైంది. ఆ విషయాన్నీ ఈరోజు సమంత స్పష్టం చేసింది కూడా. ఈ మూవీ మే లో రిలీజ్ కానుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus