ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ లో టెర్రరిస్ట్ గా సమంత!

పెళ్లి అనంతరం వరుస విజయాలు అందుకోవడమే కాక.. వైవిధ్యమైన పాత్రలు పోషిస్తూ తనలోని నటిని ప్రేక్షకులకు పరిచయం చేయడంలో బిజీ అయిపోయిన సమంత ఇటీవల “ది ఫ్యామిలీ మ్యాన్” అనే సిరీస్ లో నటించేందుకు ఒప్పుకున్న విషయం తెలిసిందే. ఈ సిరీస్ లో ఆమె నాగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఆల్రెడీ “10” అనే తమిళ చిత్రంలో సమంత విలన్ రోల్ ప్లే చేసిన విషయం తెలిసిందే.

అయితే.. ఈ సిరీస్ లో అమ్మడు టెర్రరిస్ట్ గా కనిపించబోతోందట. ప్రస్తుతం షూటింగ్ జరుపుకొంటున్న ఈ వెబ్ సిరీస్ ను వచ్చే ఏడాది విడుదల చేయనున్నారు. ఈమధ్యకాలంలో వచ్చిన ఒన్నాఫ్ ది బెస్ట్ స్పై థ్రిల్లర్ సిరీస్ గా పేరు సంపాదించుకొన్న “ది ఫ్యామిలీ మేన్” సిరీస్ లో నటించడం సమంతను మరింత మందికి పరిచయం చేయడం ఖాయం. స్టార్ డమ్, ఫేమ్ లాంటివి పట్టించుకోకుండా ప్రయోగాలు చేస్తూ తన ఉనికిని ఘనంగా చాటుకొంటున్న సమంత ప్లానింగ్ ఆమె తోటి నటీమణులకు ఆదర్శనీయం.

17 ఏళ్ళ కెరీర్లో ప్రభాస్ రిజెక్ట్ చేసిన సినిమాలేంటో తెలుసా..?
వయసుకు మించిన పాత్రలు చేసి మెప్పించిన టాలీవుడ్ హీరోలు..!
తిప్పరామీసం సినిమా రివ్యూ & రేటింగ్!
ఏడు చేపల కథ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus