Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » సమంత ‘యూ టర్న్’ సక్సెస్ మీట్..!!

సమంత ‘యూ టర్న్’ సక్సెస్ మీట్..!!

  • September 19, 2018 / 09:50 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

సమంత ‘యూ టర్న్’ సక్సెస్ మీట్..!!

సమంత ప్రధాన పాత్రలో వస్తున్న చిత్రం ‘ యూ టర్న్’.. మిస్టరీ థ్రిల్లర్ జోనర్ గా గ‌త వారం విడుద‌లైన ఈ చిత్రం మంచి విజ‌యం సాధించింది. పవన్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఆది పినిశెట్టి పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా న‌టించ‌గా.. భూమిక చావ్లా, రాహుల్ రవీంద్రన్ ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్, వి. వై. కంబైన్స్ బ్యానర్ పై శ్రీనివాస్ చిట్టూరి , రాంబాబు బండారు ఈ సినిమాను నిర్మించారు. సెప్టెంబ‌ర్ 18న‌ హైదరాబాద్ లోని ద‌స్ప‌ల్లా హోట‌ల్లో ఈ చిత్ర‌ విజయోత్సవ వేడుక ఘనంగా జరిగింది.. ఈ కార్యక్రమానికి ఎంపీ కవిత, డైరెక్టర్ నందిని రెడ్డిలు ముఖ్య అతిధులుగా వచ్చారు.

ఈ సందర్భంగా నటుడు రాహుల్ రవీంద్రన్ మాట్లాడుతూ.. కమర్షియల్ సినిమాలు మాత్రమే ప్రేక్షకులు చూస్తున్నారన్న అపోహ ఇప్పుడు లేదు.. మంచి కంటెంట్ ఉన్న చిన్న సినిమా , పెద్ద సినిమా ఏదైనా ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. ప్రొడ్యూసర్స్ గారికి మంచి టేస్ట్ ఉంది.. ఇంత మంచి సినిమా మొదటి సినిమాగా తీయడం వారికే చెల్లింది.. సినిమాని ఇంత విజయవంతం చేసినందుకు ప్రేక్షకులకు చాలా థాంక్స్ అన్నారు..

డైరెక్టర్ పవన్ కుమార్ మాట్లాడుతూ.. సినిమా విజయం సాధించినందుకు చాల హ్యాపీగా ఉంది.. తెలుగు, తమిళ్లో వచ్చిన ఈ సినిమా రెండు భాషల్లోనూ మంచి హిట్ అయ్యింది.. ప్రేక్షకులకు ధ‌న్య‌వాదాలు.. సమంత సినిమాలో చాలా బాగా న‌టించారు.. మ్యూజిక్ కి మంచి మార్కులు పడ్డాయి.. అన్నారు.

ఎంపీ కవిత మాట్లాడుతూ.. ఈ సినిమా కి పనిచేసిన అందరికి మంచి విజయం దక్కింది.. వండర్ ఫుల్ సినిమా ఇది.. చూసిన ప్రతి ఒక్కరు సినిమా చాలా బాగా ఉంది అంటున్నారు.. సమంత ఈ సినిమాలో చాలా డిఫరెంట్ గా కనిపించింది.. రంగస్థలంలో , యూ టర్న్ లో చాలా వేరియేషన్స్ చూపించింది.. సమంత సినిమాల్లోనే కాదు నిజజీవితంలో కూడా చాలా మంచి వ్యక్తిత్వం ఉన్న మనిషి.. డిఫరెంట్ స్టోరీస్ ఉన్న సినిమాలను ప్రతి ఒక్కరు ఆదరిస్తారు అనడానికి ఈ సినిమానే ఉదాహరణ.. చాలా మంచి సినిమా.. ఇలాంటి సినిమాని అందరు ఆదరించాలి.. అన్నారు..

డైరెక్టర్ నందిని రెడ్డి మాట్లాడుతూ.. కొంతమంది డైరెక్టర్ ల సినిమా లు ఎప్పుడెప్పుడు వస్తాయా అని ఎదురు చూస్తుంటాను అలాంటి డైరెక్టర్ లలో పవన్ కుమార్ గారు ఒకరు.. అయన మేకింగ్ చాల డిఫరెంట్ గా ఉంటుంది.. అయన లూసియా సినిమా చూసాను .. చాలా బాగుంది.. అప్పటినుంచి అయన సినిమాలు చూడడం మొదలుపెట్టాను.. అయన తెలుగులోకి కూడా రావడం చాల ఆనందంగా ఉంది.. ఈ సినిమా లో పనిచేసిన అందరికి కంగ్రాట్స్. సమంత చాల కష్టపడే వ్యక్తి.. ఆమెకు ఈ విజయం దక్కాలి.. మంచి సినిమా వస్తే ప్రతి ఒక్కరు ఆదరిస్తారు.. అన్నారు..

సమంత మాట్లాడుతూ.. సినిమాని ఇంత పెద్ద హిట్ చేసినందుకు అందరికి థాంక్స్..మా సినిమాని సపోర్ట్ చేసినందుకు మీడియాకి, రివ్యూయర్స్ కి చాలా చాలా కృతజ్ఞతలు.. నేను చేసిన సినిమాల్లో ఇంత పాజిటివ్ రివ్యూస్ రావడం , నా యాక్టింగ్ కి రావడం చాలా ఆనందంగా ఉంది.. ఇక్కడికి వచ్చిన కవిత గారికి, డైరెక్టర్ నందికి గారికి చాల థాంక్స్.. ఇంత మంచి సినిమా తీసిన ప్రొడ్యూసర్స్ కి కృతజ్ఞతలు.. వాళ్ళ ఫస్ట్ సినిమా గా ఇది చేసినందుకు గర్వంగా ఉంది.. నా కెరీర్ లో మంచి సినిమా ఇచ్చిన డైరెక్టర్ పవన్ కి చాలా థాంక్స్.. ఈ సినిమా తో మూడు స్టేట్స్ లో సక్సెస్ కొట్టాడు.. ఇది మొదలు మాత్రమే.. ఆయనలో ఇంకా చాలా టాలెంట్ ఉంది.. ఈ చిత్రంలో నటించిన అందరికి శుభాకాంక్షలు.. సినిమా చూసిన ప్రేక్షకులు తప్పకుండా థ్రిల్ కు గురవుతున్నారు.. సినిమాని ఇంత పెద్ద హిట్ చేసిన ప్రేక్షకులకు మరొకసారి ధన్యవాదాలు.. అన్నారు..

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #MP Kavitha Kalvakuntla
  • #Samantha
  • #U Turn
  • #U Turn Press Meet
  • #U Turn Success Meet

Also Read

Nani: సెప్టెంబర్ నెలలో రిలీజ్ అయిన నాని సినిమాలు మరియు వాటి ఫలితాలు..!

Nani: సెప్టెంబర్ నెలలో రిలీజ్ అయిన నాని సినిమాలు మరియు వాటి ఫలితాలు..!

Mrunal Thakur: షాపింగ్ మాల్ ఓపెనింగ్ లో సందడి చేసిన హీరోయిన్ మృణాల్ ఠాకూర్

Mrunal Thakur: షాపింగ్ మాల్ ఓపెనింగ్ లో సందడి చేసిన హీరోయిన్ మృణాల్ ఠాకూర్

Ranabaali: రణబాలి వాయిదా.. నిజమేనా?

Ranabaali: రణబాలి వాయిదా.. నిజమేనా?

ఆంధ్ర ప్రదేశ్ నంది అవార్డుల మహోత్సవం పై క్లారిటీ ఇచ్చిన ఏపీ ఎఫ్డిసి చైర్మన్ భరత్ భూషణ్

ఆంధ్ర ప్రదేశ్ నంది అవార్డుల మహోత్సవం పై క్లారిటీ ఇచ్చిన ఏపీ ఎఫ్డిసి చైర్మన్ భరత్ భూషణ్

The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

The Paradise: ‘ది ప్యారడైజ్’ సినిమాతో నాని రూ.300 కోట్ల క్లబ్లో చేరేనా?

The Paradise: ‘ది ప్యారడైజ్’ సినిమాతో నాని రూ.300 కోట్ల క్లబ్లో చేరేనా?

related news

Samantha: సినిమాలు వదిలేద్దాం అనుకున్నా.. ఎన్నో మెయిల్స్‌ పెట్టా: సమంత

Samantha: సినిమాలు వదిలేద్దాం అనుకున్నా.. ఎన్నో మెయిల్స్‌ పెట్టా: సమంత

Tollywood: పరాభవ నామ సంవత్సరం.. వీరిని పరాభవాల నుండి బయట పడేసిందిగా

Tollywood: పరాభవ నామ సంవత్సరం.. వీరిని పరాభవాల నుండి బయట పడేసిందిగా

trending news

Nani: సెప్టెంబర్ నెలలో రిలీజ్ అయిన నాని సినిమాలు మరియు వాటి ఫలితాలు..!

Nani: సెప్టెంబర్ నెలలో రిలీజ్ అయిన నాని సినిమాలు మరియు వాటి ఫలితాలు..!

16 mins ago
Mrunal Thakur: షాపింగ్ మాల్ ఓపెనింగ్ లో సందడి చేసిన హీరోయిన్ మృణాల్ ఠాకూర్

Mrunal Thakur: షాపింగ్ మాల్ ఓపెనింగ్ లో సందడి చేసిన హీరోయిన్ మృణాల్ ఠాకూర్

1 hour ago
Ranabaali: రణబాలి వాయిదా.. నిజమేనా?

Ranabaali: రణబాలి వాయిదా.. నిజమేనా?

5 hours ago
ఆంధ్ర ప్రదేశ్ నంది అవార్డుల మహోత్సవం పై క్లారిటీ ఇచ్చిన ఏపీ ఎఫ్డిసి చైర్మన్ భరత్ భూషణ్

ఆంధ్ర ప్రదేశ్ నంది అవార్డుల మహోత్సవం పై క్లారిటీ ఇచ్చిన ఏపీ ఎఫ్డిసి చైర్మన్ భరత్ భూషణ్

20 hours ago
The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

1 day ago

latest news

Mammootty: నాకు మాయ చేయడం తెలీదు.. జాతీయ అవార్డుపై మమ్ముట్టి రియాక్షన్‌ వైరల్‌

Mammootty: నాకు మాయ చేయడం తెలీదు.. జాతీయ అవార్డుపై మమ్ముట్టి రియాక్షన్‌ వైరల్‌

2 mins ago
Nani: వావ్‌ నానీ… సౌండ్‌ లేకుండా ఫ్యాన్‌ మీట్‌ పెట్టి.. ఫుడ్‌ పెట్టి.. సెల్ఫీలిచ్చి..

Nani: వావ్‌ నానీ… సౌండ్‌ లేకుండా ఫ్యాన్‌ మీట్‌ పెట్టి.. ఫుడ్‌ పెట్టి.. సెల్ఫీలిచ్చి..

1 hour ago
Sithara: మరో తమిళ హీరోను కన్‌ఫామ్‌ చేసుకున్న నాగవంశీ.. ఎవరంటే?

Sithara: మరో తమిళ హీరోను కన్‌ఫామ్‌ చేసుకున్న నాగవంశీ.. ఎవరంటే?

1 hour ago
Paradise: షాకిచ్చిన ‘ప్యారడైజ్‌’ బ్రిటిష్‌ సెన్సార్‌ రిపోర్ట్‌.. అందులో ఏముందంటే?

Paradise: షాకిచ్చిన ‘ప్యారడైజ్‌’ బ్రిటిష్‌ సెన్సార్‌ రిపోర్ట్‌.. అందులో ఏముందంటే?

3 hours ago
Nani: ‘ది ప్యారడైజ్‌’ పోస్టుల తొలగింపు ఆర్డర్లు.. క్లారిటీ ఇచ్చిన నాని.. వాటి కోసమే అంటూ..

Nani: ‘ది ప్యారడైజ్‌’ పోస్టుల తొలగింపు ఆర్డర్లు.. క్లారిటీ ఇచ్చిన నాని.. వాటి కోసమే అంటూ..

4 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version