సీక్వెల్ తీస్తా అని చెప్పాడు.. మరి హీరోయిన్ సంగతేంటి విశాల్..!

  • February 19, 2021 / 06:37 PM IST

విశాల్ తన తరువాతి చిత్రమైన ‘చక్ర’ తో ప్రేక్షకులను పలకరించేందుకు రెడీ అయ్యాడు. ఫిబ్రవరి 19న(ఈరోజు) ఆ చిత్రం విడుదల కాబోతుంది. ఎన్నో అడ్డంకుల నడుమ ఈరోజు విడుదలైన ఆ చిత్రం ఎలాంటి టాక్ ను రాబట్టుకుంటుందో అని ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉండగా.. ‘చక్ర’ ప్రమోషన్లలో భాగంగా తన తరువాతి చిత్రాల పై కూడా స్పందించాడు. అందులో ‘ఇరుంబు తిరై’..( తెలుగులో ‘అభిమన్యుడు’) సీక్వెల్ లో నటించబోతున్నట్టు స్పష్టంచేశాడు.

అంతేకాదు ఆ చిత్రాన్ని స్వయంగా విశాలే డైరెక్ట్ చేయబోతున్నట్టు కూడా చెప్పుకొచ్చాడు.ప్రస్తుతం అతను ‘డిటెక్టివ్’ సీక్వెల్ ‘డిటెక్టివ్2’ చేస్తున్నాడు. ఆ ప్రాజెక్టు నుండీ కూడా దర్శకుడు మిస్కిన్ తప్పుకుంటే.. బ్యాలన్స్ షూటింగ్ ను తనే తెరకెక్కిస్తున్నాడు. సరే ఈ విషయాలను పక్కన పెట్టేస్తే.. ‘అభిమన్యుడు2’ విశాల్ డైరెక్ట్ చేయబోతున్నట్టు క్లారిటీ ఇచ్చేసాడు కాబట్టి.. హీరోయిన్ సంగతి ఏంటంటూ డిస్కషన్లు మొదలయ్యాయి. మొదటి పార్ట్ లో సమంత హీరోయిన్ గా నటించింది. ఆ చిత్రంలో ఆమె మానసిక వైద్యురాలు పాత్రలో కనిపించింది.

ఆ చిత్రానికి సీక్వెల్ కాబట్టి లెక్క ప్రకారం అయితే.. ఇందులో కూడా ఆమెనే హీరోయిన్ గా నటించాల్సి ఉంటుంది. కానీ విశాల్ డైరెక్షన్లో అంటే ఆమె ఒప్పుకుంటుందా అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. ఎందుకంటే సమంత ఇప్పుడు కథా ప్రాధాన్యత కలిగిన సినిమాలనే చేస్తుంది. మరి ‘అభిమన్యుడు2’ లో సమంత పాత్రని విశాల్ బాగా డెవలప్ చేయగలడా. చేస్తేనే ఆమె ఈ ప్రాజెక్టు చెయ్యడానికి ఒప్పుకుంటుంది. లేదంటే కష్టమే అని ఇన్సైడ్ టాక్.

Most Recommended Video

కాపటధారి సినిమా రివ్యూ & రేటింగ్!
దృశ్యం 2 సినిమా రివ్యూ & రేటింగ్!
ఉప్పెన సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus