లేడీ ఓరియెంటెడ్ మూవీలో నటించనున్న సమంత..!

2018 లో ‘వాల్ పోస్టర్ సినిమా’ బ్యానర్ ను స్థాపించాడు నేచురల్ స్టార్ నాని. తన తొలి ప్రయత్నంగా ‘అ!’ అనే డిఫరెంట్ చిత్రాన్ని నిర్మించి హిట్టందుకున్నాడు. ఈ చిత్రం తో ప్రశాంత్ వర్మను డైరెక్టర్ గా పరిచయం చేసిన సంగతి తెలిసిందే. ఇక రాస్తుతం వరుస చిత్రాలతో బిజీగా ఉండటంతో.. మళ్ళీ నిర్మాణ బాధ్యతల వైపు దృష్టి పెట్టలేదు.

అయితే తాజాగా నాని మళ్ళీ ఓ చిత్రాన్ని నిర్మించాలనే ఆలోచనలో ఉన్నాడని తెలుస్తుంది. రాజమౌళి తండ్రి.. సీనియర్ అండ్ స్టార్ రైటర్ అయిన విజయేంద్ర ప్రసాద్ చెప్పిన ఓ ‘లేడీ ఓరియెంటెడ్’ కథను నిర్మించాలని నాని భావిస్తున్నాడట. ఇందులో సమంత మెయిన్ లీడ్ గా నటించనుందని తెలుస్తోంది. గతంలో వీరిద్దరూ ‘ఈగ’ ‘ఏటో వెళ్ళిపోయింది మనసు’ వంటి చిత్రాలలో నటించడంతో వీరి మధ్య మంచి స్నేహ బంధం ఉంది. ఇక ఈ చిత్రంలో నటించమని నాని అడుగగా… సమంత ఓకే అని చెప్పేసిందట. అయితే ఈ చిత్రాన్నీ ఎవరు డైరెక్ట్ చేయబోతున్నారనేది తెలియాల్సి ఉంది. ఇక ప్రస్తుతం సమంత ‘మజిలీ’ షూటింగ్ లో బిజీగా ఉండగా.. నాని ‘జెర్సీ’ చిత్ర షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. తరువాత విక్రమ్ కుమార్ డైరెక్షన్లో కూడా ఓ చిత్రం చేయబోతున్నాడు. మరి సమంతతో నాని నిర్మించే చిత్రం ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తుందో చూడాలి..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus