Samantha: తుంబాడ్ దర్శకుడితో సామ్.. ఆ వివాదంపై మేకర్స్ క్లారిటీ!

స్టార్ హీరోయిన్ సమంత (Samantha), వెబ్‌ సిరీస్‌లలో కూడా సత్తా చాటుతూ అభిమానులను అలరిస్తున్న సంగతి తెలిసిందే. ఆమె రీసెంట్‌గా సిటాడెల్: హనీ బన్నీ తో ఆకట్టుకోగా, ఇప్పుడు రక్త్ బ్రహ్మాండ్ అనే క్రైమ్ థ్రిల్లర్‌లో నటిస్తోంది. తుంబాడ్ ఫేమ్ రాహిల్ అనిల్ బార్వే దర్శకత్వం వహిస్తున్న ఈ సిరీస్‌ ను రాజ్ అండ్ డీకే ప్రొడ్యూస్ చేస్తున్నారు. అయితే, ఈ ప్రాజెక్ట్ మధ్యలో ఆగిపోయిందనే వార్తలు హాట్ టాపిక్ గా మారాయి.

Samantha

ఇటీవల సోషల్ మీడియాలో, ప్రాజెక్ట్ ఆడిట్‌లో ఆర్థిక అవకతవకలు (రూ.2 కోట్లు) జరిగినట్లు నెట్‌ఫ్లిక్స్ గుర్తించిందని వార్తలు చక్కర్లు కొట్టాయి. దీని వల్ల షూటింగ్ నిలిచిపోయిందని, సమంత ప్రాజెక్ట్ నుండి తప్పుకుందనే రూమర్స్ కూడా వ్యాప్తి చెందాయి. దీంతో ఫ్యాన్స్ మధ్య గందరగోళం నెలకొంది. ఈ నేపథ్యంలో రాజ్ అండ్ డీకే సోషల్ మీడియా వేదికగా స్పందించారు.

రక్త్ బ్రహ్మాండ్ షూటింగ్ పిక్స్ షేర్ చేస్తూ, “ఇలాంటి పుకార్లు ఎప్పుడూ ఉంటాయి. సైలెంట్ గా ఉండడమే ఉత్తమ పరిష్కారం. కానీ ఇప్పుడు క్లారిటీ ఇస్తున్నాం.. షూటింగ్ కొనసాగుతోంది, ఎటువంటి ఇబ్బంది లేదు,” అంటూ తేల్చేశారు. ఈ సిరీస్‌లో సమంతతో పాటు బాలీవుడ్ హీరో ఆదిత్య రాయ్ కపూర్, అలీ ఫజల్ (Ali Fazal), వామికా గబ్బీ (Wamiqa Gabbi) కీలక పాత్రల్లో నటిస్తున్నారు. యాక్షన్, థ్రిల్, డ్రామాతో ప్రేక్షకులను మంత్ర ముగ్దులను చేసేలా స్క్రిప్ట్ రెడీ చేశారని సమాచారం.

2025 చివరలో ఈ సిరీస్ స్ట్రీమింగ్ కి రానుందని మేకర్స్ తెలిపారు. అంతేకాక, రాజ్ అండ్ డీకే తమ కొత్త ప్రాజెక్ట్స్‌ గురించి కూడా అప్‌డేట్ ఇచ్చారు. ఫ్యామిలీ మ్యాన్ 3, గోల్కొండ టేల్స్, రక్త్ బ్రహ్మాండ్ వంటి బిగ్ ప్రాజెక్ట్స్‌పై పని చేస్తున్నట్లు తెలిపారు. మొత్తానికి, సమంత సిరీస్ ఆగిపోయిందని వచ్చిన పుకార్లపై మేకర్స్ స్పష్టమైన సమాధానం ఇచ్చారు.

నెగిటివ్ టాక్ వచ్చినా సందీప్ కిషన్ సినిమాకి సీక్వెల్ చేస్తున్నారట!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus