Shaakuntalam: సమంత సినిమా రిలీజ్ డేట్ రగడ!

టాలీవుడ్ లో మరోసారి విడుదల తేదీల వివాదం నెలకొంది. ఈ మధ్యకాలంలో వివాదాస్పద కామెంట్స్ తో వార్తల్లో నిలుస్తోన్న దిల్ రాజు మరోసారి సినిమా రిలీజ్ డేట్స్ విషయంలో గొడవ జరిగేలా చేస్తున్నారు. ఫిబ్రవరి 17న ఆయన నిర్మించిన ‘శాకుంతలం’ సినిమాను రిలీజ్ చేయాలని దిల్ రాజు నిర్ణయించుకున్నారు. దానికి తగ్గట్లే ఒక పోస్టర్ ని వదిలి.. రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేశారు. అయితే ఇందులో గొడవ ఏముందని అనుకోవచ్చు కానీ అదే తేదీకి ఇప్పటికే మూడు సినిమాలు రిలీజ్ డేట్స్ ని ప్రకటించాయి.

ఒకటి సితార సంస్థ నిర్మించిన ‘సర్’ సినిమా. ధనుష్ హీరోగా నటిస్తోన్న ఈ సినిమాను వెంకీ అట్లూరి డైరెక్ట్ చేస్తున్నారు. ఇక రెండో సినిమా విశ్వక్ సేన్ నటిస్తోన్న ‘ధమ్కీ’. ఈ సినిమాలో నటించడంతో పాటు దర్శకత్వం, నిర్మాణ బాధ్యతలు కూడా చేపట్టారు విశ్వక్. మూడో సినిమా గీతా ఆర్ట్స్ నిర్మిస్తోన్న ‘వినరో భాగ్యము విష్ణు కథ’. కిరణ్ అబ్బవరం నటిస్తోన్న ఈ సినిమాను బన్నీ వాస్ నిర్మిస్తున్నారు. ఇలా మూడు సినిమాలు ఆల్రెడీ రిలీజ్ డేట్స్ ని అనౌన్స్ చేసేస్తే..

ఇప్పుడు దిల్ రాజు తన సినిమా డేట్ ని ప్రకటించడం హాట్ టాపిక్ గా మారింది. పైగా ఆ మూడు సినిమాలను దిల్ రాజు పంపిణీ చేయకపోవడం గమనించాల్సిన విషయం. దీంతో ఇండస్ట్రీలో కావాలనే దిల్ రాజు తన సినిమాను ఈ డేట్ కి వేస్తున్నారనే మాటలు వినిపిస్తున్నాయి. ఆ కారణంగా ఇప్పుడు దిల్ రాజుకి వ్యతిరేకంగా ఇండస్ట్రీలో ఒక గ్రూప్ రెడీ అవుతుందని టాక్.

నైజాంలో దిల్ రాజుకి ఉన్న క్రేజ్ తెలిసిందే. ఎంత పెద్ద సినిమానైనా ఆయనే రిలీజ్ చేస్తారు. కానీ ఈ మధ్యకాలంలో ఎందుకో ఆ పద్ధతి మారుతుంది. ఈ విషయంలో దిల్ రాజు హర్ట్ అవుతున్నట్లు సమాచారం.

బటర్ ఫ్లై సినిమా రివ్యూ& రేటింగ్!
2022లో అలరించిన తెలుగు సినిమాలు ఇవే!

ఇప్పటవరకూ ఎవరు చూడని శ్రీలీల రేర్ ఫోటో గ్యాలరీ!!
‘ఖుషి’ పవన్ ఫ్యాన్స్ కు ఒక డ్రగ్ లాంటిది..రీ రిలీజ్ లో ఎందుకు చూడాలి అంటే..?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus