‘ఆహా’ కోసం రంగంలోకి దిగిన అక్కినేని కోడలు!

కరోనా కారణంగా థియేటర్లు మూత పడడంతో డిజిటల్ ఫ్లాట్ ఫామ్ లకు క్రేజ్ పెరిగింది. సినీ అభిమానులు ఫ్రెష్ కంటెంట్ కోసం ఓటీటీలను నమ్ముకుంటున్నారు. దీనికి తోడు ఈ మధ్యకాలంలో కొత్త సినిమాలన్నీ ఓటీటీలలో నేరుగా రిలీజ్ అవుతుండడంతో వీటి క్రేజ్ మరింతగా పెరిగింది. ఓటీటీలకు జనాల్లో ఉన్న హైప్ ని గమనించిన ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ‘ఆహా’ అనే యాప్ ని లాంచ్ చేశారు. ఇందులో డబ్బింగ్ సినిమాలు, తెలుగు వెబ్ సిరీస్ లతో పాటు కొత్త సినిమాలను కూడా స్ట్రీమ్ చేస్తూ తన సత్తా చాటుతున్నారు.

ఈ క్రమంలో ‘ఆహా’ని మరింత పాపులర్ చేయడానికి వరుస షోలను ప్లాన్ చేస్తున్నాడు. ఇప్పటికే ప్రముఖ యాంకర్ సుమతో ఓ టాక్ షోని రన్ చేస్తుండగా.. కమెడియన్ హర్షతో ఓ ప్రోగ్రామ్ ని డిజైన్ చేశారు. ఈ షోలో హర్ష పలువురు సెలబ్రిటీలను ఇంటర్వ్యూ చేస్తూ ఫన్ క్రియేట్ చేస్తుంటాడు. రేపటి నుండే ఈ షో స్ట్రీమ్ కానుంది. ఇక తాజాగా టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంతను రంగంలోకి దింపుతున్నారని తెలుస్తోంది. అక్కినేని వారి కోడలితో ఓ టాక్ షోను ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.

తాజాగా ‘ఆహా’ రిలీజ్ చేసిన టీజర్ ప్రోమో ఈ షోకి సంబంధించిందనే సమాచారం. ఈ ప్రోమోలో సమంతని చూపించకుండా.. కొన్ని క్యారెక్టర్లను చూపిస్తూ.. ‘వీళ్లతో అ నుండి ఆహా అనిపించింది ఎవరు..?’ అంటూ సస్పెన్స్ మైంటైన్ చేశారు. త్వరలోనే ఈ షోకి సంబంధించిన వివరాలను వెల్లడించనున్నారు. పెళ్లి తరువాత సరికొత్త కథలను ఎన్నుకుంటూ కెరీర్ సాగిస్తోన్న సమంత ఇప్పుడు డిజిటల్ ఇండస్ట్రీలో కూడా బిజీ కానుంది!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ : భీమ్ పాత్రకు రాజమౌళి ఆ పాయింటునే తీసుకున్నాడా?
‘బిగ్ బాస్’ అఖిల్ గురించి మనకు తెలియని విషయాలు..!
టాలీవుడ్లో 30 కోట్ల మార్కెట్ కలిగిన హీరోలు ఎవరో తెలుసా?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus