పేరు ఒక్కటే.. కథలే వేరు

  • June 14, 2016 / 11:59 AM IST

కొన్ని పేర్లలో పవర్ ఉంటుంది. ఆ పవర్ సినిమా విజయానికి దోహదపడుతుంది. అందుకే సినిమా పేర్లపై ఇది వరకు గొడవలు కూడా జరిగాయి. ఇప్పుడు యువ నటులు తమ సినిమాలకు ఇది వరకు హిట్ సాధించిన సినిమాల పేర్లను పెట్టుకునేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. కొత్త కథలకు పాత పేర్లు పెట్టి రూపొందించిన చిత్రాల్లో కొన్ని హిట్ అవుతున్నాయి. మరి కొన్ని ఫట్ అవుతున్నాయి.

దేవదాసుదేవదాసు(1953). వెండి తెరపై అద్భుత ప్రేమ కావ్యం. అక్కినేని నాగేశ్వర రావు, సావిత్రిల అపూర్వ నటన ఈ సినిమాకు ప్రాణం పోసాయి. ఏఎన్ఆర్ మరుపురాని చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. యాభై ఏళ్ల తర్వాత 2006 లో దేవదాస్ పేరుతో వచ్చిన సినిమా కూడా విజయం సాధించింది. ఆనాటి దేవదాసులో హీరో ప్రేమించి సర్వం కోల్పోతే.. నేటి దేవదాసులో ప్రేయసి ని సొంతం చేసుకున్నాడు.

మల్లీశ్వరిఅలనాటి నటి భానుమతి, ఎన్టీఆర్ ల క్లాసిక్ మూవీ మల్లీశ్వరి(1951). ఇది మనసుకు హత్తుకునే ప్రేమకథ. 2004 వచ్చిన మల్లీశ్వరి నవ్వులు పూయించింది. ఇందులోను ప్రేమకథ ఉన్నాత్రివిక్రమ్ మాటలే గుర్తుండి పోతాయి. వాటిని మంచి టైమింగ్ తో పేల్చిన విక్టరీ వెంకటేష్ నటన నవ్వుని తెప్పిస్తాయి. ఈ రెండు హిట్ సాధించాయి.

శ్రీమంతుడుగత ఏడాది బంపర్ హిట్ గా నిలిచిన మహేష్ బాబు చిత్రం “శ్రీమంతుడు”. సొంత ఊరిని దత్తత తీసుకునే నయా కథతో వచ్చిన ఈ సినిమా పేరు మీదనే గతంలో అక్కినేని నాగేశ్వరరావు చిత్రం ఒకటి ఉంది. 1971 లో విడుదలైన ఆ సినిమాలో ఏఎన్ఆర్, జమునల క్యూట్ లవ్ ఆనాటి యువత మదిని మెలిపెట్టింది.

మిస్సమ్మఎన్టీఆర్, ఏఎన్ఆర్, సావిత్రి, జమున వీరి కలయికలో వచ్చిన కళా ఖండం మిస్సమ్మ(1955). గొప్ప మల్టీ స్టారర్ చిత్రంగా కీర్తిగాంచింది. 2003లో భూమిక మిస్సమ్మగా మెప్పించింది. అప్పుడు ఇప్పుడూ మిస్సమ్మ ని తెలుగు ప్రజలు గౌరవించారు.

గీతాంజలిఅక్కినేని నాగేశ్వర రావుకి దేవదాసులా నాగార్జునకి మైలు రాయిగా నిలిచిన చిత్రం గీతాంజలి. 1989 లో విడుదలైన ఈ ప్రేమ కథా చిత్రాన్ని ఆనాటి కుర్రకారు లెక్కలేనన్ని సార్లు చూశారు. ఇదే పేరుతో రెండేళ్ల క్రితం వచ్చిన గీతాంజలి హారర్ కామెడీ తో అలరించింది. రెండూ పేరును, ఆర్ధిక లాభాలను పొందాయి.

మోసగాళ్ల కు మోసగాడుసాహసానికి మరో పేరు సూపర్ స్టార్ కృష్ణ. ఆయన కౌబాయ్ గెటప్ లో అలరించిన సినిమా “మోసగాళ్ల కు మోసగాడు”. 1971 లో వచ్చిన ఈ మూవీ విమర్శకుల నోరు మూయించింది. అదే పేరుతో గత ఏడాది కృష్ణ అల్లుడు సుధీర్ బాబు చిత్రం థియేటర్లలోకి వచ్చింది. కొన్ని రోజులు కూడా ఆడకుండానే వెనుతిరిగింది.

శంకరాభరణంశంకరాభరణం విశ్వనాధ్ తెలుగువారికి అందించిన ఓ ఆణిముత్యం. సినిమాలోని ప్రతి సన్నివేశం ప్రేక్షకులను కదిపేసింది. నిర్మాత జేబు నింపింది. ఈ పేరును ఒక కిడ్నాప్ కథతో తీసిన సినిమాకు పెట్టుకున్నారు. కథకు టైటిల్ కి సింక్ కాలేక .. ప్రేక్షకుల హృదయాలకు చేరుకోలేక పోయింది. గీతాంజలి పేరు హిట్ తెచ్చి పెట్టిందని కోన వెంకట్ అదే సెంటిమెంట్ తో శంకరా భరణం అని పేరు పెట్టాడు. ఈ సారి సెంటిమెంట్ వర్క్ అవుట్ కాలేదు.

గణేష్సింగిల్ హ్యాండ్ గణేష్. 1998 లో చాలా పాపులర్. విక్టరీ వెంకటేష్ ఫుల్ పవర్ యాక్షన్ గణేష్ సినిమాలో చూపించి హిట్ అందుకున్నాడు. ఈ పేరుతో రామ్ 2009లో వచ్చాడు. ఏ వర్గం ప్రజలను కూడా ఆకట్టుకోలేక పోయాడు. రామ్ కి దేవదాస్ హిట్ ఇస్తే.. గణేష్ ఫ్లాప్ ఇచ్చాడు.

దేవుడు చేసిన మనుషులుమహానటుడు ఎన్టీఆర్, సూపర్ స్టార్ కృష్ణ కలిసి మ్యాజిక్ చేసిన సినిమా “దేవుడు చేసిన మనుషులు”. విజయవాడ, నెల్లూర్ కేంద్రాలలో 175 రోజులు ఆడి రికార్డ్ సృష్టించింది. ఈ పేరుతో పూరి జగన్నాథ్ కొత్త కథను తెరకెక్కించాడు. మాస్ మహారాజ్ రవితేజ హీరోగా చేసినా ఈ చిత్రం ప్రేక్షకుల బుర్రలోకి ఎక్కలేదు.

అడవిరాముడుదర్శకేంద్రుడు కె. రాఘవేంద్ర రావు, ఎన్టీఆర్ కాంబినేషన్లో వచ్చిన అడవిరాముడు(1977) గొప్ప విజయం సాధించింది. ఇందులో పాటలు ఇప్పటికీ .. ఎప్పటికీ ఫేమస్సే. ఆసినిమా స్పూర్తితో ప్రభాస్ 2004 లో అడవిరాముడు గా వచ్చాడు. ఆకట్టుకోలేక పోయాడు.

వీటితో పాటు ఆరాధన(1962, 1987), ప్రేమ(1952, 1989), అప్పుచేసి పప్పుకూడు(1959, 2002), ఇద్దరు మిత్రులు(1961,1999), ఘర్షణ(1988, ఘర్షణ 2014), బంది పోటు(1963,2015), దొంగాట (1997,2015) సినిమాలు వచ్చాయి. తాజాగా నాని నటించిన జెంటిల్ మాన్ రిలీజ్ కి సిద్ధంగా ఉంది. ఇది ఒకప్పటి అర్జున్ హిట్ సినిమా పేరు. అంతే కాకుండా నాగార్జున డిఫరెంట్ గా కనిపించిన అంతం పేరుతో రష్మీ థ్రిల్లర్ సినిమా రాబోతోంది. ఇవి హిట్టా .. ఫట్టా త్వరలోనే తెలుస్తుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus