ఈ కారణంతోనే సినిమాలకి దూరమయ్యాను : సమీరా రెడ్డి

‘నరసింహుడు’ చిత్రంతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చింది సమీరా రెడ్డి. అటు తరువాత ‘జై చిరంజీవ’ ‘అశోక్’ ‘కృష్ణం వందే జగద్గురుమ్’ వంటి చిత్రాల్లో నటించింది. అయితే ఈ చిత్రాలేమీ హిట్టవ్వకపోవడంతో పెద్దగా ఆఫర్లు రాలేదు. కానీ ఈ అమ్మడు మంచి డ్యాన్సర్. ఈమె డాన్సులు మాత్రం మన తెలుగు ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకున్నాయి. ఇక అవకాశాలు లేకపోవడంతో పెళ్ళి చేసుకుని సెటిలయ్యింది. ఇప్పటికే ఓ బిడ్డకు జన్మనిచ్చిన ఈ భామ తిరిగి మళ్లీ సినిమాల్లో బిజీ అవ్వాలనుకుంది. కానీ అధిక బరువు కారణంగా తన ఆశలన్నీ తలకిందులు అయ్యాయని తెలిపింది.

సమీరా రెడ్డి తన సోషల్ మీడియా ద్వారా తెలుపుతూ.. ‘బాబుకి జన్మనిచ్చిన తరువాత ఓ వ్యాధి కారణంగా ఐదు నెలల పాటూ బెడ్ కే పరిమితం కావాల్సి వచ్చింది.. ఇంట్లోనే ఉండడం వలన బరువు బాగా పెరిగిపోయాను. వర్కవుట్స్ చేయడానికి వీలు లేకపోవడంతో ఏకంగా 102 కేజీల బరువు పెరిగాను. ఇలాంటి సమయంలో ఎప్పుడైనా బయటకి వెళితే నన్ను చూసి.. రక రకాల కామెంట్లు చేసి నవ్వేవారు.. అవి నన్ను ఎంతగానో బాధకు గురి చేసేవి. ఈ కారణంగా డిప్రెషన్ లోకి వెళ్ళిపోయాను, వైద్యుల సహాయంతో మళ్ళీ బయటపడ్డాను. ప్రస్తుతం గర్భవతిని కాబట్టి నా బిడ్డకు జన్మనిచ్చిన తరువాత మునుపటి రూపంలోకి వచ్చేందుకు ప్రయత్నిస్తాను” అంటూ చెప్పుకొచ్చింది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus