Sameera Reddy: అప్పట్లో తారక్ నేను క్లోజ్ గా ఉండేవాళ్లమన్న సమీరా.. కానీ?

  • May 24, 2024 / 01:56 PM IST

టాలీవుడ్ ఇండస్ట్రీలోని స్టార్ హీరోయిన్లలో ఒకరైన సమీరారెడ్డికి (Sameera Reddy) ప్రేక్షకుల్లో ఊహించని స్థాయిలో క్రేజ్ ఉందనే సంగతి తెలిసిందే. తెలుగులో ఎక్కువ సినిమాలు చేయకపోయినా ఈ బ్యూటీని అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య మాత్రం తగ్గలేదు. జూనియర్ ఎన్టీఆర్ తో (Jr NTR) నరసింహుడు (Narasimhudu) , అశోక్ (Ashok) సినిమాలలో ఈ బ్యూటీ నటించారు. ఈ రెండు సినిమాలు సక్సెస్ సాధించకపోయినా ఈ కాంబినేషన్ కు మంచి గుర్తింపు వచ్చింది. తక్కువ సమయంలోనే రెండు సినిమాలలో కలిసి నటించడంతో ఎన్టీఆర్, సమీరారెడ్డి మధ్య ఏదో ఉందని వార్తలు ప్రచారంలోకి వచ్చాయి.

అయితే ఎన్టీఆర్ తో లవ్ అంటూ వచ్చిన వార్తల వల్ల తాను కెరీర్ పరంగా ఇబ్బందులు పడ్డానని సమీరా రెడ్డి వెల్లడించారు. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ వ్యక్తిత్వం చాలా మంచిదని ఆమె అన్నారు. తారక్ తో కలిసి రెండు సినిమాలలో నటించానని ఆ సమయంలో ఎన్టీఆర్ నుంచి చాలా విషయాలు నేర్చుకున్నానని సమీరా రెడ్డి పేర్కొన్నారు. నేను, తారక్ సన్నిహితంగా మెలగడం వల్ల మా ఇద్దరి మధ్య ఏదో ఉందని ప్రచారం జరిగిందని ఆమె వెల్లడించారు.

వైరల్ అయిన గాసిప్స్ వల్ల నా కుటుంబ సభ్యులకు సైతం నేను జవాబు చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆమె పేర్కొన్నారు. వైరల్ అయిన గాసిప్స్ నా కుటుంబ సభ్యులను ఎంతో బాధ పెట్టాయని సమీరా రెడ్డి పేర్కొన్నారు. సమీరా రెడ్డి ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు. రాబోయే రోజుల్లో సమీరారెడ్డి టాలీవుడ్ ఇండస్ట్రీలోకి రీఎంట్రీ ఇస్తారేమో చూడాల్సి ఉంది.

సమీరా రెడ్డి వయస్సు పెరుగుతున్నా ఆమెకు క్రేజ్ తగ్గడం లేదు. సమీరా రెడ్డి లుక్ విషయంలో సైతం పెద్దగా జాగ్రత్తలు తీసుకోవడం లేదు. వయస్సులో జూనియర్ ఎన్టీఆర్ తో పోలిస్తే సమీరారెడ్డి పెద్ద కావడం గమనార్హం. సమీరారెడ్డి వయస్సు ప్రస్తుతం 45 సంవత్సరాలు అనే సంగతి తెలిసిందే.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus