Samuthirakani, Jr NTR: తారక్ పై షాకింగ్ కామెంట్లు చేసిన సముద్రఖని!

తెలుగుతో పాటు ఇతర భాషల్లో కూడా జూనియర్ ఎన్టీఆర్ కు ఊహించని స్థాయిలో క్రేజ్ ఉంది. సింగిల్ టేక్ లో జూనియర్ ఎన్టీఆర్ నటిస్తారని రిహార్సల్స్ కు రాకుండా తారక్ అద్భుతంగా డ్యాన్స్ చేస్తారని డైరెక్టర్లు, కొరియోగ్రాఫర్లు పలు సందర్భాల్లో తారక్ గురించి గొప్పగా చెప్పారనే సంగతి తెలిసిందే. తారక్ కు వేర్వేరు అంశాల గురించి కూడా లోతైన అవగాహన ఉంది. బిగ్ బాస్ సీజన్1, ఎవరు మీలో కోటీశ్వరులు షోల ద్వారా తారక్ హోస్ట్ గా మెప్పించారు.

ఎలాంటి పాత్ర ఇచ్చినా ఆ పాత్రకు పూర్తిస్థాయిలో న్యాయం చేసి తారక్ ప్రశంసలు అందుకుంటూ పాపులారిటీని పెంచుకుంటున్నారు. అయితే ప్రముఖ నటుడు సముద్రఖని తాజాగా ఒక సందర్భంలో తారక్ గురించి మాట్లాడుతూ షాకింగ్ కామెంట్లు చేశారు. జూనియర్ ఎన్టీఆర్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటారని సముద్రఖని పేర్కొన్నారు. రాజకీయాల గురించి తారక్ కు లోతుగా జ్ఞానం ఉందని సముద్రఖని చెప్పుకొచ్చారు. తారక్ తనతో తమిళనాడు రాజకీయాల గురించి మాట్లాడారని ఎన్నికలకు ముందే డీఎంకే పార్టీ అధికారంలోకి వస్తుందని తారక్ చెప్పారని సముద్రఖని కామెంట్లు చేశారు.

ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత ఎన్నికల ఫలితాల విషయంలో నేను చెప్పిందే నిజమైంది కదా అని తారక్ అన్నారని సముద్రఖని కామెంట్లు చేశారు. సమాజం, రాజకీయాల గురించి మాట్లాడాలంటే ఎన్టీఆర్ తో మాట్లాడాలని సముద్రఖని పేర్కొన్నారు. సముద్రఖని తారక్ తనను ఆశ్చర్యానికి గురి చేశారని చెబుతూ చేసిన కామెంట్లు ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

2009 సంవత్సరంలో తారక్ టీడీపీ తరపున ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. రాబోయే రోజుల్లో తారక్ ను ఏపీ సీఎంగా చూడాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. రాజకీయాలపై తారక్ కు ఆసక్తి ఉన్నా కొన్ని కారణాల వల్ల ఎన్టీఆర్ వెనుకడుగు వేస్తున్నారు. రాబోయే రోజుల్లో తారక్ రాజకీయాలకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలు అయితే ఉన్నాయి.

సర్కారు వారి పాట సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

మహేష్ బాబు 26 సినిమాలు.. మరియు వాటి బాక్సాఫీస్ కలెక్షన్లు..!
‘భద్ర’ టు ‘అఖండ’.. బోయపాటి డైరెక్ట్ చేసిన సినిమాల కలెక్షన్లు..!
‘దూకుడు’ టు ‘సర్కారు వారి పాట’.. ఓవర్సీస్ లో మహేష్ బాబు 1 మిలియన్ మూవీస్ లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus