మలయాళ బ్యూటీ సంయుక్త మీనన్ (Samyuktha Menon).. ‘భీమ్లా నాయక్’ తో (Bheemla Nayak) టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చారు. అటు తర్వాత ‘బింబిసార'(Bimbisara) ‘సార్’ (Sir) ‘విరూపాక్ష’ (Virupaksha) వంటి సినిమాల్లో హీరోయిన్ గా నటించి హిట్లు అందుకుంది. అయితే కళ్యాణ్ రామ్ తో (Nandamuri Kalyan Ram) చేసిన ‘డెవిల్’ (Devil) సినిమా అంతగా ఆడలేదు. దీంతో ఆమె కొంచెం స్లో అయ్యింది. వరుస సినిమాలు ఓకే చేయకుండా ఆచి తూచి సినిమాలు చేయాలని చూస్తుంది. ఈ క్రమంలో నిఖిల్ తో (Nikhil Siddhartha) ‘స్వయంభు’ (Swayambhu) అనే పాన్ ఇండియా సినిమా ఓకే చేసింది.
మరోపక్క శర్వానంద్ తో (Sharwanand) ‘నారి నారి నడుమ మురారి’, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ (Bellamkonda Sai Sreenivas) 12 వ సినిమా, ‘రాక్షసి’ అనే ప్రాజెక్టులు ఓకే చేసి మళ్ళీ పుంజుకోవడానికి రెడీ అవుతుంది. ఇంతలో సంయుక్త ‘అఖండ 2’ లో నటిస్తున్నట్టు అధికారిక ప్రకటన వచ్చింది.ఇది కూడా పాన్ ఇండియా సినిమానే. అయితే ‘అఖండ’ లో (Akhanda) ప్రగ్యా జైస్వాల్ (Pragya Jaiswal) హీరోయిన్ గా నటించింది. మరి ‘అఖండ 2’ ని ఎలా తీసుకున్నారు? అనే డౌట్ రావచ్చు. వాస్తవానికి ‘అఖండ 2’ ఈమె చేస్తుంది.
ముఖ్యమైన పాత్ర అని తెలుస్తుంది. బాలయ్యకి (Nandamuri Balakrishna) జోడీగా కాదట. ఈ సినిమాలో సంయుక్త యాక్షన్ ఎపిసోడ్స్ లో కూడా నటించాల్సి ఉందట. ‘అఖండ 2’ సినిమాని ‘దర్శకుడు బోయపాటి శ్రీను (Boyapati Srinu) చాలా కసితో తెరకెక్కిస్తున్నాడు. ఇంటర్వెల్..కే ప్రేక్షకులు పెట్టిన టికెట్ డబ్బులకి న్యాయం జరుగుతుంది’ అంటూ ఇటీవల సంగీత దర్శకుడు తమన్ (S.S.Thaman) ‘డాకు మహారాజ్’ (Daaku Maharaaj) సక్సెస్ మీట్లో చెప్పుకొచ్చిన సంగతి తెలిసిందే.