Samyuktha Menon: సంయుక్త మీనన్ నెక్స్ట్ లెవెల్ గ్లామర్ షో!

  • March 25, 2023 / 08:29 PM IST

సంయుక్త మీనన్.. తక్కువ టైంలోనే చాలా పాపులర్ అయిపోయింది.’భీమ్లా నాయక్’ లో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ ఆ సినిమాలో పవన్ కళ్యాణ్ కు చెల్లెలు లాంటి పాత్రలో.. రానాకి భార్య పాత్రలో నటించి మెప్పించింది. అటు తర్వాత కళ్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కిన ‘బింబిసార’ సినిమాలో కూడా హీరోయిన్ గా నటించింది. ఆ సినిమాలో ఆమె పాత్ర అంతంత మాత్రమే అయినప్పటికీ ఆ సినిమా బ్లాక్ బస్టర్ అవ్వడం వల్ల..

సంయుక్త(Samyuktha)టాలీవుడ్ కు గోల్డెన్ లెగ్ గా అవతరించింది. ఇక ఈ ఏడాది రిలీజ్ అయిన ధనుష్ ద్విభాషా చిత్రం ‘సార్’ తో ఈమె టాప్ హీరోయిన్ల లిస్ట్ లో చేరిపోయింది. ఇక త్వరలో ‘విరూపాక్ష’ మూవీతో మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతుంది ఈ బ్యూటీ. సంయుక్త మొదట ‘బింబిసార’ సినిమాకు సైన్ చేసిందట. ఆ తర్వాత ‘విరూపాక్ష’ కి సైన్ చేసిందట. అయితే ఈ సినిమాలు ఆలస్యమవ్వడంతో ‘భీమ్లా నాయక్’ మొదట రిలీజ్ అయ్యింది.

‘విరూపాక్ష’ కథ సంయుక్తకి బాగా నచ్చిందట. చాలా ఇష్టపడి చేసిన సినిమా ఇదని ఆమె తెలిపింది. అలాగే ఆమె గత సినిమాల్లో కంటే కూడా ఈ సినిమాలో స్కిన్ షో కొంచెం ఎక్కువగానే చేసినట్లు తెలుస్తుంది. తాజాగా ‘విరూపాక్ష’ నుండి ‘నచ్చావులే నచ్చావులే’ అనే సాంగ్ రిలీజ్ అయ్యింది. ఈ పాటలో ఎక్కువగా సంయుక్త మీనన్ గ్లామరే హైలెట్ అయ్యిందని చెప్పాలి.



హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus