బిగ్ బాస్ హౌస్ లో సందీప్ మాస్టర్ రికార్డ్ క్రియేట్ చేశారు. ఇప్పటివరకూ జరిగిన అన్నీ సీజన్స్ లో, అన్ని లాంగ్వేజస్ లో కూడా ఎవ్వరూ 8వారాలు నామినేషన్స్ లోకి రాకుండా లేరు. కానీ, సందీప్ మాస్టర్ ఈ రికార్డ్ ని క్రియేట్ చేశారు. కొన్ని తనకి అలా కలిసి వస్తే, మరికొంత హౌస్ మేట్స్ సహకారం కూడా ఉంది. నిజానికి మొదటి వారంలోనే 5వారాల ఇమ్యూనిటీని సంపాదించుకునే పవర్ అస్త్రాని పొందారు. దీనివల్ల 5 వారాలు మాస్టర్ నామినేషన్స్ లోకి రాలేదు.
ఆ తర్వాత ఆరోవారం నామినేషన్స్ లోకి వచ్చారు. కానీ, గౌతమ్ సీక్రెట్ రూమ్ లో నుంచీ వచ్చి స్పెషల్ పవర్ ద్వారా సందీప్ మాస్టర్ ని ఆ వారం నామినేషన్స్ నుంచీ సేఫ్ చేశారు. ఇక 7వ వారం కూడా సందీప్ మాస్టర్ ని పెద్దగా ఎవరూ నామినేట్ చేయలేదు. పల్లవి ప్రశాంత్ ఒక్కడే నామినేట్ చేశాడు. దీంతో ఒకే ఒక్క ఓటు వచ్చింది కానీ నామినేషన్స్ లోకి రాలేదు. ఇక ఈవారం నామినేషన్స్ తప్పించుకుంటే బిగ్ బాస్ చరిత్రలోనే రికార్డ్ క్రియేట్ చేసినట్లే అవుతుంది.
గతంలో హిందీలో ఒక కంటెస్టెంట్ 7వారాలు నామినేషన్స్ లోకి రాలేదు. ఇప్పుడు ఈరికార్డ్ ని సమం చేశాడు సందీప్ మాస్టర్. ఇప్పుడు ఇది బ్రేక్ చేస్తే ఫస్ట్ టైమ్ హిస్టరీని క్రియేట్ చేస్తాడు. ప్రస్తుతం సోషల్ మీడియాలో అందుతున్న సమాచారం ప్రకారం అయితే సందీప్ మాస్టర్ నామినేషన్స్ లో లేడు. కానీ, లైవ్ లో నామినేషన్ ప్రక్రియ పూర్తి అయిపోయింది. సందీప్ మాస్టర్ కి ఒకే ఒక ఓటు వచ్చింది. దీంతో ఈవారం కూడా నామినేషన్స్ లో లేరనే టాక్ వినిపిస్తోంది.
దీంతో బిగ్ బాస్ (Bigg Boss 7 Telugu) చరిత్రలోనే సందీప్ మాస్టర్ అరుదైనా రికార్డ్ ని క్రియేట్ చేశాడు. నీతోనే డ్యాన్స్ తో ఫేమ్ అయిన సందీప్ మాస్టర్ చాలా ఉత్సాహంగా బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టాడు. డ్యాన్స్ షో టైటిల్ విన్నర్ గా నిలిచారు. ఇప్పుడు ఈ బిగ్ బాస్ టైటిల్ పైన కూడా కన్నేశాడు. ఇక రెండు మూడు వారాలు గేమ్ ఇలాగే ఆడితే టిక్కెట్ టు ఫినాలే టాస్క్ కూడా వస్తుంది. అది గనక సందీప్ మాస్టర్ గెలిస్తే నామినేషన్స్ లో లేకుండా డైరెక్ట్ గా ఫినాలేకి వెళ్లిపోతాడు.
అప్పుడు డైరెక్ట్ గా విన్నర్ కి ఓటింగ్ అనేది జరుగుతుంది. అయితే, గత కొన్ని వారాలుగా సందీప్ మాస్టర్ గేమ్ ని బాగా ఇంప్రూవ్ చేశాడు. వచ్చిన కొత్తల్లో కంటే కూడా ఇప్పుడు సందీప్ గేమ్ ని చాలామంది ఇష్టపడుతున్నారు. మరి ఈసారి తన ఓటింగ్ అనేది ఎలా ఉంటుందో తెలియాలంటే నామినేషన్స్ లోకి రావాల్సిందే అంటున్నారు బిగ్ బాస్ లవర్స్. మరి చూద్దాం ఏం జరగబోతోందనేది.
భగవంత్ కేసరి సినిమా రివ్యూ & రేటింగ్!
లియో సినిమా రివ్యూ & రేటింగ్!
టైగర్ నాగేశ్వరరావు సినిమా రివ్యూ & రేటింగ్!