Sandeep Master: బిగ్ బాస్ సందిప్ పోస్ట్ వైరల్ ..!

ఒక డ్యాన్స్ మాస్టర్ గా సందీప్ మన అందరికీ సుపరిచితమే. ప్రస్తుతం ఎన్నో డాన్స్ వీడియోలను చేస్తే సోషల్ మీడియాలో కూడా ఎంతో మంచి సక్సెస్ అయ్యారు. ఇక ఈయన బుల్లితెరపై ప్రసారం అవుతున్నటువంటి నీతోనే డాన్స్ అనే కార్యక్రమంలో పాల్గొని టైటిల్ గెలిచారు. ఇక ఈ కార్యక్రమం పూర్తి కాగానే వెంటనే బిగ్ బాస్ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం రావడంతో సందీప్ మాస్టర్ బిగ్ బాస్ లోకి ఏంట్రీ ఇచ్చారు.

అయితే బిగ్ బాస్ హౌస్ లో సందిప్ చాలా సేఫ్ గా ఆడుతున్నట్టుగా అందరికీ అనిపించింది. హౌస్ లో ఆయన కోపం తెచ్చుకున్న సందర్భాలను చేతి వేళ్ళతో లెక్కపెట్టొచ్చు. ఈ షోలో ఈయన 8 వారాలపాటు కొనసాగి 8వ వారం ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చారు. ఇలా సందీప్ మాస్టర్ ఎలిమినేట్ అయిన తర్వాత పెద్ద ఎత్తున ఇంటర్వ్యూలకు హాజరవుతూ అనేక విషయాల్లో ఆయన చాలా ఓపెన్ గా మాట్లాడుతున్నాడు.

ఇదంతా పక్కన పెడితే ఒకసారి నామినేషన్స్ లో సందీప్ ప్రశాంత్ తో వాదనలో ఉన్నప్పుడు పొరపాటున ఆ హీట్ వాతావరణం లో ‘బొంగు’ అనే పదాన్ని వాడుతాడు. అందుకు నాగార్జున నుండి సందీప్ కి ఒక రేంజ్ లో కోటింగ్ పడుతుంది. పదే పదే సందీప్ ని బొంగులో డ్యాన్సర్ అంటూ సంబోధించి ఆయన్ని అవమానించాడు. దీనికి సందీప్ (Sandeep Master) సతీమణి జ్యోతి కూడా చాలా బాధపడింది.

రీసెంట్ గా శివాజీ కూడా అలా మాట్లాడినప్పుడు నాగార్జున ఆయన్ని మందలించాడు కానీ, సందీప్ మాస్టర్ ని తిట్టినట్టుగా మాత్రం తిట్టలేదు. దీనికి సందీప్ మాస్టర్ ఇంస్టాగ్రామ్ లో ఒక పోస్టుని పెడుతూ ‘ నేను మాట్లాడితే బూతులు.. ఆయన మాట్లాడితే నీతులు, భలే న్యాయం చెప్పారు నాగార్జున గారు’ అంటూ చాలా వ్యంగ్యంగా ఆయన పెట్టిన ఒక పోస్ట్ సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది.

జపాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

జిగర్ తండ డబుల్ ఎక్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ వారం థియేటర్/ఓటీటీల్లో రిలీజ్ కాబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus