“అర్జున్ రెడ్డి” సినిమాను మన తెలుగోళ్ళందరూ (90% పైగా) నెత్తిన పెట్టుకొని దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తెరపై పలికించిన భావాలకు హ్యాట్సాప్ చెప్పి.. హీరో విజయ్ దేవరకొండను సూపర్ స్టార్ ను చేశారు. దాంతో “అర్జున్ రెడ్డి” తెలుగులో వచ్చిన కల్ట్ క్లాసిక్ సినిమాల్లో ఒకటిగా నిలిచిపోయింది. ఆ చిత్రాన్ని హిందీలో మళ్ళీ సందీప్ రెడ్డే రీమేక్ చేస్తుంటే అందరూ బాలీవుడ్ నుంచి కూడా అదే తరహా రెస్పాన్స్ వస్తుంది అనుకొన్నారు. కానీ.. సీన్స్ రివర్స్ అయ్యింది. బాలీవుడ్ జనాలు సినిమాను ఆదరిస్తున్నప్పటికీ.. క్రిటిక్స్ మాత్రం ఏకీపాడేసారు. ఇక లేడీ క్రిటిక్స్ అయితే ఇదొక చెత్త సినిమా అని తీర్మానించి పాడేశారు.
అయితే.. సదరు క్రిటిక్స్ రివ్యూలు వెబ్ సైట్స్ లో పెట్టుకోవడానికి తప్ప దేనికీ ఉపయోగపడలేదు. అందుకు కారణం జనాలు “కబీర్ సింగ్”ను విపరీతంగా ఆదరించారు. హిందీలో “ఎ” సర్టిఫికేట్ వచ్చినప్పటికీ 200 కోట్లు కలెక్ట్ చేసిన మొట్టమొదటి చిత్రంగా “కబీర్ సింగ్” చరిత్ర సృష్టించింది. ఈ సందర్భంగా బాలీవుడ్ ఫిలిమ్ క్రిటిక్ అనుపమ చోప్రాకు వీడియో ఇంటర్వ్యూ ఇచ్చిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా.. బాలీవుడ్ క్రిటిక్స్ ను, వాళ్ళ జడ్జ్ మెంట్ ను ఏకీపాడేశారు. ముఖ్యంగా బాలీవుడ్ టాప్ క్రిటిక్స్ లో ఒకరైన రాజీవ్ మసంద్ ను కూరలో కరివేపాకులా తీసి పాడేశాడు. కబీర్ సింగ్ సినిమా కంటే కూడా ఇప్పుడు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా వీడియో ఇంటర్వ్యూ బాలీవుడ్ లో హాట్ టాపిక్ అయ్యింది.