Nagarjuna: నాగార్జున సినిమాలో సందీప్ రెడ్డి వంగా.. ఎంతమంది గమనించారు?

సందీప్ రెడ్డి వంగా.. ఈ పేరు చెప్పగానే అందరికీ ‘అర్జున్ రెడ్డి’ గుర్తుకొచ్చేస్తుంది. టాలీవుడ్లో వచ్చిన ఓ గేమ్ ఛేంజర్ మూవీ ఇది. ఇందులో సరికొత్త హీరోయిజం కనిపిస్తుంది.డైలాగులు కూడా చాలా కొత్తగా ఉంటాయి. రఫ్ ఈ ఒక్క సినిమాతో హీరో విజయ్ దేవరకొండ అలాగే దర్శకుడు సందీప్ రెడ్డి వంగా.. పాన్ ఇండియా ఇమేజ్ ను సొంతం చేసుకున్నారు. ఈ సినిమా వచ్చి 6 ఏళ్ళు దాటినా.. దీని హవా ఇంకా తగ్గలేదు అనే చెప్పాలి.

ఇదిలా ఉండగా… సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్ చేయడానికి ముందు నటుడిగా కూడా ఓ క్రేజీ సినిమాలో నటించాడు అనే డిస్కషన్ ఇప్పుడు ఎక్కువగా జరుగుతుంది అని చెప్పాలి. అవునా… సందీప్ ఏ సినిమాలో నటించాడు అనే డౌట్ మీకు రావచ్చు. నాగార్జున సినిమాలో సందీప్ రెడ్డి వంగా నటించినట్టు వారు చెబుతున్నారు. అవును.. గతంలో నాగార్జున హీరోగా ‘కేడి’ అనే సినిమా వచ్చింది.

2010 లో రిలీజ్ అయిన ఈ సినిమాకి కిరణ్ కుమార్ దర్శకుడు. (Nagarjuna) నాగార్జునకి హోమ్ బ్యానర్ లాంటి ‘కామాక్షి మూవీస్’ పై ఈ సినిమాని డి.శివప్రసాద్ రెడ్డి నిర్మించారు. మమతా మోహన్ దాస్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది. అయితే ఈ సినిమాలోని ఓ సన్నివేశంలో సందీప్ రెడ్డి వంగా కూడా కనిపించాడు. బోట్ సీక్వెన్స్ లో ఆయన కనిపించినట్టు నెటిజన్లు ఓ వీడియోని వైరల్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతుంది

ఆదికేశవ్ సినిమా రివ్యూ & రేటింగ్!

కోట బొమ్మాళీ పి.ఎస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సౌండ్ పార్టీ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus