పాన్ ఇండియా దర్శకుడు సందీప్ రెడ్డి వంగా శుక్రవారం వరంగల్‌లో సందడి చేశారు. తన దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న శ్రీకాంత్ గండ్ల వివాహానికి హాజరయ్యారు. ‘అర్జున్ రెడ్డి’, ‘కబీర్ సింగ్’, ‘యానిమల్’ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాల్లో సహాయ దర్శకుడిగా పనిచేసిన శ్రీకాంత్ ప్రస్తుతం సందీప్ రెడ్డి డైరెక్షన్లో రూపొందుతున్న పాన్ ఇండియా సినిమా ‘స్పిరిట్’ టీమ్‌లో భాగంగా కొనసాగుతున్నారు.
ఈ వివాహ వేడుకకు సినీ పరిశ్రమకు చెందిన కొందరు ప్రముఖులు, మిత్రులు, తన సన్నిహితులు హాజరయ్యారు. గురువు స్వయంగా వచ్చి ఆశీర్వదించడంతో వేడుకకు ప్రత్యేకత సంతరించుకుంది. తన శిష్యుడికి శుభాకాంక్షలు తెలుపుతూ, అతడి భవిష్యత్తు మరింత బాగుండాలని గా ఉండాలని సందీప్ ఆకాంక్షించారు. సందీప్ రెడ్డి వంగా అక్కడ ఉన్నారని తెలిసిన అభిమానులు ఆయనతో సెల్ఫీలు, ఫోటోలు దిగేందుకు క్యూ కట్టారు. పెళ్లి వేదిక మొత్తం ఆయన చుట్టూ సందడి నెలకొంది.
అందరూ ఆయనను కలుసుకోవడానికి ఆసక్తి చూపడంతో ఆ వేడుకలో సందీప్ రెడ్డి వంగా ప్రధాన ఆకర్షణగా నిలిచారు. అయితే సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్ లో రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా , త్రిప్తి దిమిరి హీరోయిన్ గా రూపొందుతున్నపాన్ ఇండియా మూవీ “స్పిరిట్” ను భూషణ్ కుమార్, ప్రణయ్ రెడ్డి వంగా నిర్మిస్తున్నారు. ఈ మూవీ లో ప్రకాష్ రాజ్ , వివేక్ ఒబెరాయ్ ముఖ్యమైన పాత్రలలో నటిస్తున్నారు.