Sandeep Reddy Vanga: మెగాస్టార్ తో సినిమాపై సందీప్ వంగా క్లారిటీ ఇదే.. ఏం చెప్పారంటే?

నూటికి నూరు శాతం సక్సెస్ రేట్ ఉన్న దర్శకులలో సందీప్ రెడ్డి వంగా కూడా ఒకరు. యానిమల్ సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డ్ స్థాయిలో కలెక్షన్లను సాధించగా సందీప్ రెడ్డి వంగా తర్వాత మూవీ ప్రభాస్ హీరోగా స్పిరిట్ అనే టైటిల్ తో తెరకెక్కుతోంది. చిరంజీవికి సందీప్ రెడ్డి వంగా వీరాభిమాని అనే సంగతి తెలిసిందే. తాజాగా ఒక ఇంటర్వ్యూలో సందీప్ రెడ్డి వంగా మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేయగా ఆ విషయాలు వైరల్ అవుతున్నాయి.

చిరంజీవి, షారుఖ్ ఖాన్ సినిమాలకు డైరెక్షన్ చేయాలని ఉందని అన్నారు. అవకాశం వస్తే ఈ ఇద్దరు స్టార్ హీరోల కోసం అద్భుతమైన స్క్రిప్ట్ లను సిద్ధం చేస్తానని సందీప్ రెడ్డి వంగా వెల్లడించారు. ఈ హీరోలతో సినిమా చేసే ఛాన్స్ ఎప్పుడొస్తుందో మాత్రం తెలియదని ఆయన కామెంట్లు చేశారు. ఏడాదికి ఒక సినిమా అయినా చేయాలనే లక్ష్యంతో ముందుకెళుతున్నానని సందీప్ రెడ్డి వంగా అన్నారు.

నేను కథలు సొంతంగా రాస్తానని ఇతరులతో కలిసి పని చేయనని ఆయన కామెంట్లు చేశారు. ఇతరులతో కథను పంచుకోవడం వల్ల టైమ్ వేస్ట్ అవుతుందని ఆయన అన్నారు. భవిష్యత్తులో మరింత ఫాస్ట్ గా సినిమాలపై పని చేస్తానని సందీప్ రెడ్డి వంగా కామెంట్లు చేశారు. సందీప్ రెడ్డి వంగా చేసిన కామెంట్లు సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతుండటం గమనార్హం. సందీప్ డైరెక్షన్ స్కిల్స్ కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) తన సినిమాలకు తన సోదరుడు నిర్మాతగా వ్యవహరించేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ విధంగా చేయడం వల్ల నిర్మాతగా కూడా సందీప్ రెడ్డి వంగాకు కళ్లు చెదిరే స్థాయిలో లాభాలు వస్తున్నాయి. సందీప్ రెడ్డి వంగా భవిష్యత్తు ప్రాజెక్ట్ లు సైతం భారీ విజయాలను సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. సందీప్ రెడ్డి వంగా కెరీర్ పరంగా ఒక్కో మెట్టు పైకి ఎదుగుతున్నారు.

ఈ ఏడాది ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న తెలుగు సినిమాలు!

ఈ ఏడాది వచ్చిన 10 రీమేక్ సినిమాలు… ఎన్ని హిట్టు.. ఎన్ని ఫ్లాప్?
ఈ ఏడాది ప్రేక్షకులు తలపట్టుకొనేలా చేసిన తెలుగు సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus