Michael Jackson Biopic: మైకేల్ జాక్సన్ బయోపిక్‌ ను సీరియస్ గా తీసుకున్న సందీప్ రెడ్డి వంగా

‘అర్జున్ రెడ్డి’ ‘కబీర్ సింగ్’ ‘యానిమల్’ సినిమాలతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా, ఇప్పుడు వరుస ప్రాజెక్టులతో బిజీ బిజీగా గడుపుతున్నాడు. ప్రభాస్ తో స్పిరిట్ అనౌన్స్ చేసి చాలా కాలం అయ్యింది. సందీప్ నెక్స్ట్ చేయబోయే సినిమా ఇదే. అలాగే అల్లు అర్జున్ తో కూడా ఓ సినిమా చేస్తున్నట్టు అధికారిక ప్రకటన వచ్చింది. మరోవైపు సందీప్ తన డ్రీమ్ ప్రాజెక్ట్‌పై సీరియస్‌గా ఫోకస్ పెట్టినట్టు తెలుస్తుంది. పాప్ కింగ్ మైకేల్ జాక్సన్ బయోపిక్ తీస్తానని ఈ డైరెక్టర్ గతంలో చెప్పిన మాటలను చాలామంది తేలిగ్గా తీసుకున్నారు.

Michael Jackson Biopic

కానీ, సందీప్ ఇప్పుడు ఆ ప్రాజెక్ట్‌కు సంబంధించి రీసెర్చ్ మొదలుపెట్టారని, దానికోసం ప్రత్యేకంగా పర్యటనలు చేస్తూ సీక్రెట్‌గా వివరాలు సేకరిస్తున్నారని తెలుస్తోంది. ఈ వార్తలు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి. హాలీవుడ్ నిర్మాతలతో కలిసి, ఈ బయోపిక్‌ను తెరకెక్కించి గ్లోబల్ ఆడియన్స్‌కు చేరువ చేయాలన్నది సందీప్ ప్లాన్. మైకేల్ జాక్సన్ బాల్యం, అతని శారీరక మార్పులు, చుట్టూ అల్లుకున్న వివాదాలు… ఇలా అతని జీవితం ఒక గొప్ప కథ అని సందీప్ బలంగా నమ్ముతున్నారు. ఎవరు తీసినా సరే, ఆ సినిమాకు తనే మొదటి టికెట్ కొంటానని, అతని పూర్తి కథ తెలుసుకోవాలని ఉందని సందీప్ గతంలోనే చెప్పారు.

అయితే, ఈ ప్రాజెక్ట్‌కు అతిపెద్ద సవాలు మైకేల్ జాక్సన్ పాత్రకు సరైన నటుడిని వెతకడమేనని సందీప్ అభిప్రాయపడుతున్నారు. పాప్ కింగ్ జీవితంలోని సున్నితమైన, వివాదాస్పద అంశాలను (లైంగిక ఆరోపణలు వంటివి) తెరపై చూపించడం కూడా కత్తిమీద సాము లాంటిదే. అందుకే, పర్ఫెక్ట్ నటుడు దొరికే వరకు సందీప్ ఆగేలా కనిపిస్తున్నారు.ప్రస్తుతం ‘స్పిరిట్’, ‘యానిమల్ పార్క్’ సినిమాలతో బిజీగా ఉన్నా, సందీప్ ఈ బయోపిక్‌పై గ్రౌండ్ వర్క్ చేస్తుండటం విశేషం. ఏదేమైనా, సందీప్ గనుక ఈ ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కిస్తే, అది ప్రపంచవ్యాప్తంగా ఒక సంచలనం కావడం ఖాయం.

చిరుతో కలిసి నానమ్మ పాడె మోసిన అల్లు అర్జున్.. ఫోటోలు వైరల్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus