సందీప్ రెడ్డి వంగా 2 సినిమాలకే పాన్ ఇండియా స్టార్ డైరెక్టర్ గా ఎదిగాడు. ‘అర్జున్ రెడ్డి’ ‘కబీర్ సింగ్’ ‘యానిమల్’ సినిమాలు తక్కువ ఓ మోస్తరు బడ్జెట్లో తీసినప్పటికీ అవి భారీ వసూళ్లు సాధించాయి. కాంట్రోవర్సీల విషయంలో కూడా అవి టాప్ రేంజ్..కి వెళ్లిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ప్రభాస్ తో సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు సందీప్ రెడ్డి వంగా. ‘స్పిరిట్’ పేరుతో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. స్క్రిప్ట్ అంతా ఎప్పుడో లాక్ అయిపోయింది. కాకపోతే ప్రభాస్ బల్క్ డేట్స్ ఇస్తే.. షూటింగ్ మొదలుపెట్టాలనే ఆలోచనలో ఉన్నాడు సందీప్.
ఒక్కసారి ప్రాజెక్టు మొదలుపెడితే ప్రభాస్ పూర్తిగా ‘స్పిరిట్’ పనిమీదే ఉండాలనేది సందీప్ ఆలోచన. అతని డెడికేషన్ కూడా అలానే ఉంటుంది. కానీ ప్రభాస్ అంత యాక్టివ్ గా ఉండే రకం కాదు. ఈ ప్రాజెక్టు పూర్తయ్యే వరకు ప్రభాస్ కి ఇది పరీక్షే.మరోపక్క ‘స్పిరిట్’ స్క్రిప్ట్ కానీ, పోస్ట్ ప్రొడక్షన్ పనులు కానీ ఎప్పుడో ఫినిష్ చేశాడు సందీప్. ఒక్కసారి సెట్స్ పైకి వెళ్తే.. 100 వర్కింగ్ డేస్ లో సినిమా కంప్లీట్ అయ్యే అవకాశం ఉంది. అందుకే ఇప్పుడు తన నెక్స్ట్ ప్రాజెక్టుపై దృష్టి పెట్టాడు సందీప్.
‘స్పిరిట్’ పూర్తయ్యాక మహేష్ బాబుతో ఓ సినిమా చేయాలనే ఆలోచనలో సందీప్ ఉన్నాడు. కానీ మధ్యలో అల్లు అర్జున్ 23వ సినిమాని సందీప్ డైరెక్ట్ చేస్తాడనే అధికారిక ప్రకటన వచ్చింది. అయితే అల్లు అర్జున్ తో సెట్ అయిన సినిమా సెట్స్ పైకి వెళ్లడం అనేది అంత ఈజీ వ్యవహారం కాదు. ‘ఐకాన్’ ఎలా అయ్యిందో అందరికీ తెలుసు. త్రివిక్రమ్ తో చేయాల్సిన సినిమా కూడా ఎన్టీఆర్ చేతికి వెళ్ళిపోయింది అంటే అక్కడ పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.
ఇక సందీప్ కి మహేష్ అంటే చాలా అభిమానం. స్పిరిట్ కి ముందు మహేష్ తోనే సందీప్ సినిమా ఉంటుందని అంతా అనుకున్నారు. కానీ ఇద్దరికీ నచ్చే స్క్రిప్ట్ వర్కౌట్ కాలేదు. కానీ మహేష్ కి కూడా సందీప్ వర్కింగ్ స్టైల్ బాగా ఇష్టం. ‘యానిమల్’ సినిమాని మహేష్ దగ్గరుండి ప్రమోట్ చేసిన సంగతి తెలిసిందే. సో మహేష్ కి కనుక సందీప్ చెప్పే కథ నచ్చితే.. ప్రాజెక్టు వెంటనే లాక్ అయిపోతుంది అనడంలో సందేహం లేదు.