‘హనుమాన్’ సినిమాతో పాన్-ఇండియా లెవల్‌లో బ్లాక్‌బస్టర్ అందుకున్న డైరెక్టర్ ప్రశాంత్ వర్మ పేరు ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. అయితే, ఈ సక్సెస్ మధ్యలోనే ఆయనపై సోషల్ మీడియాలో ఒక పెద్ద రూమర్ చక్కర్లు కొడుతోంది. ఈ రూమర్‌పై టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ డీవీవీ దానయ్య ఒక్క స్టేట్‌మెంట్‌తో ఫుల్-స్టాప్ పెట్టారు.గత కొద్ది రోజులుగా సినీ సర్కిల్స్‌లో ప్రశాంత్ వర్మపై ఒక ప్రచారం జోరుగా సాగుతోంది.
‘హనుమాన్’ సక్సెస్ తర్వాత, హైదరాబాద్‌లో ఒక భారీ స్టూడియో కట్టేందుకు ప్రశాంత్ వర్మ పలువురు టాప్ ప్రొడ్యూసర్ల దగ్గర నుంచి సుమారు రూ.80-100 కోట్ల వరకు అడ్వాన్సులు తీసుకున్నారని టాక్ నడిచింది. అయితే, ఇప్పుడు ఆ నిర్మాతలు తమ డబ్బు తిరిగి ఇవ్వాలని ఒత్తిడి చేస్తున్నారని, ఈ విషయం ఫిలిం ఛాంబర్ వరకు వెళ్లిందని వార్తలు వైరల్ అయ్యాయి.
ఈ రూమర్లలో ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య పేరు కూడా వినిపించడంతో, ఆయన నిర్మాణ సంస్థ డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ వెంటనే స్పందించింది. ఈ ప్రచారంలో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేస్తూ ఒక అధికారిక ప్రకటన విడుదల చేసింది.”డైరెక్టర్ ప్రశాంత్ వర్మ మా దగ్గర లేదా డీవీవీ దానయ్య గారి వద్ద అడ్వాన్స్ తీసుకున్నారంటూ వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవం, నిరాధారమైనవి.
ప్రశాంత్ వర్మకు, మా సంస్థకు మధ్య ఎలాంటి ఆర్థిక లావాదేవీలు, ఒప్పందాలు, లేదా వృత్తిపరమైన సంబంధాలు లేవు” అని ఆ ప్రకటనలో తేల్చిచెప్పారు. ఇలాంటి తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేసే ముందు వాస్తవాలను చెక్ చేసుకోవాలని మీడియా సంస్థలకు, సోషల్ మీడియా పేజీలకు విజ్ఞప్తి చేశారు.ఈ ఒక్క స్టేట్‌మెంట్‌తో, కనీసం డీవీవీకి సంబంధించినంత వరకు ఈ రూమర్లకు చెక్ పడినట్లైంది.