Bigg Boss 7 Telugu: దమ్ముంటే పొలం మీద ఒట్టేయ్… అంటూ రెచ్చిపోయిన సందీప్..! అసలు ఏం జరిగిందంటే.?

బిగ్ బాస్ హౌస్ లో నామినేషన్స్ అంటేనో ఒకరికొకరు రెచ్చగొట్టుకోవడం, ఒకరిపై ఒకరు నిందలు వేసుకోవడం. గత కొన్ని వారాలుగా సైలెంట్ గా జరుగుతున్న బిగ్ బాస్ నామినేషన్స్ 7వ వారం వైలంట్ గా జరిగాయి. ఇందులో పల్లవి ప్రశాంత్ – సందీప్ ల నామినేషన్ హైలెట్ గా నిలిచింది. అంతేకాదు, పల్లవి ప్రశాంత్ నోరుజారుడు.. ఆ తర్వాత మాట మార్చాడు. అసలు సందీప్ కి – పల్లవి ప్రశాంత్ కి మద్యలో ఏం జరిగిందంటే.,, పల్లవి ప్రశాంత్ కెప్టెన్ ఎలా ఉండాలో నీకు తెలీదా అని నాగార్జున గారు అన్నారు. ఇంతమందికి నా పాయింట్ అర్ధమైంది.

నువ్వు కెప్టెన్ గా ఫైయిల్ అయ్యావని అది ఇంకా నీకు అర్ధం కావట్లేదు అన్నాడు సందీప్. దీంతో మరి నీకు కెప్టెన్ తో ఎలా ఉండాలో తెలీదా.. ప్రిన్స్ ఇంకా అమర్ ఇద్దరూ స్ప్రైట్ కోసం లొల్లి పెట్టుకుంటే ఎందుకెళ్లావ్ అంటూ పల్లవి ప్రశాంత్ ఎదురుదాడి చేశాడు. ఇద్దరి మద్యలో మాటలు పెరిగాయ్. టెక్నికల్ గా ఒక విషయం మాట్లాడతా అన్నప్పుడు దీనికి పల్లవి ప్రశాంత్ ఎలాగైనా మాట్లాడుకో, అక్కడ నుంచో, ఇక్కడ కూర్చో, స్మిమ్మింగ్ పూల్ లో దూకి మాట్లాడు, పడుకుని మాట్లాడు నీ ఇష్టం అంటూ రెచ్చగొట్టాడు.

బరాబర్ సందీప్ ట్రాక్ మారుస్తున్నాడు అనేసరికి, నీ బరాబర్ కి వాల్యూ పోయిందంటూ సందీప్ ట్రిగ్గర్ అయ్యాడు. అంతేకాదు, ఇక్కడే పల్లవి ప్రశాంత్ నోరుజారాడు. నేను ఎవ్వరికీ భయపడేదే లేదు అని, బరాబర్ ఇట్లే ఉంటా అంటూ మాట్లాడుతూనే నేను ఊరోడ్నే.. ఊరి భాష ఇట్లే ఉంటది అన్నాడు. దీంతో సందీప్ నేను ఆ మాట నిన్ను ఎప్పుడూ అనలేదు అంటే అన్నావ్ అంటూ రెచ్చిపోయాడు. లాస్ట్ టైమ్ నా వెనకాల ఇలాగే మాట్లాడావ్ ఊరోడు అన్నావ్ అన్నాడు. మస్త్ సార్లు అన్నావ్, తిరగమరగ చేసి రివీల్ చేస్కో అంటూ బాడీ లాంగ్వేజ్ కూడా మార్చాడు.

దీంతో సందీప్ కి తిక్కరేగింది. నేను 1000 పర్సెంట్ చెప్తా ఆ మాట అనలేదు. ఊరోడు అని ఎప్పుడూ అనలేదని సందీప్ చెప్పాడు. అంతేకాదు, ఆ మాట అన్నానని నీకు అనిపిస్తే నీ పొలం మీద, అన్నం మీద ఒట్టేయ్ అంటూ మాట్లాడాడు. అంతేకాదు, ఆవేశంగా సందీప్ ఊగిపోతూ నేను నా డ్యాన్స్ మీద ఒట్టేస్తున్నా చూడా నేను నిన్ను ఆ మాట అనలేదు అంటూ చెప్పాడు. దీంతో ప్రశాంత్ నాకు జ్యోతి ఊరు కెళ్లి వచ్చింది తమ్ముడూ.. నాకు గిట్లా తెలంగాణా కల్చర్ తెలుసు అర్ధమైతది తెలంగాణా అన్నావ్ అని ప్రసాంత్ రెచ్చగొట్టాడు.

దీంతో అక్కడ నేను నిన్ను ఊరోడు అని ఎందుకు అన్నాను చెప్పు అంటూ నిలదీశాడు సందీప్. దీంతో శివాజీ కల్పించుకుని నువ్వు తప్పుగానే అన్నావ్ ప్రశాంత్ అంటూ చెప్పాడు. అప్పుడు సందీప్ మరింత రెచ్చిపోయాడు. ఇద్దరూ చాలాసేపు వాగ్వివాదం చేసుకున్నారు. మొత్తానికి వీరిద్దరి ఆర్గ్యూమెంట్స్ తో హౌస్ వేడెక్కిపోయింది. అయితే, పల్లవి ప్రశాంత్ ని తేజ కూడా నామినేట్ చేశాడు. దీంతో నామినేషన్స్ లోకి వచ్చాడు. సందీప్ కి కేవలం ఒక్క ఓటు మాత్రమే రావడం వల్ల (Bigg Boss 7 Telugu) ఈవారం కూడా నామినేషన్స్ లోకి రాలేదు.

‘బిగ్ బాస్ 7’ వైల్డ్ కార్డ్ ఎంట్రీ నయనీ పావని గురించి 10 ఆసక్తికర విషయాలు!

‘పుష్ప’ టు ‘దేవర’.. 2 పార్టులుగా రాబోతున్న 10 సినిమాలు..!
‘బిగ్ బాస్ 7’ వైల్డ్ కార్డ్ ఎంట్రీ అశ్విని శ్రీ గురించి 10 ఆసక్తికర విషయాలు!

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus