SPIRIT: ‘స్పిరిట్’ యూనివర్స్.. ఆశలు బానే ఉన్నాయి కానీ ఆ లాజిక్ మిస్సయ్యారు!

ప్రభాస్ సందీప్ వంగా కాంబోపై అంచనాలు మామూలుగా లేవు. రీసెంట్‌గా ముహూర్తం షాట్ కొట్టారో లేదో, అప్పుడే ‘స్పిరిట్ యూనివర్స్’ అంటూ సోషల్ మీడియాలో కథలు మొదలైపోయాయి. సినిమా రావడానికి ఇంకా రెండేళ్లు టైమ్ ఉంది, కానీ అప్పుడే ఈ క్రాస్ ఓవర్ ముచ్చట్లు ఏంటో అర్థం కావడం లేదు. షూటింగ్ కూడా మొదలవ్వకుండానే ఇలాంటి రూమర్స్ రావడం సినిమాకి అంత మంచిది కాదనిపిస్తోంది.

SPIRIT

అసలు ఈ గోల ఎక్కడ మొదలైందంటే.. అప్పట్లో బాలయ్య ‘అన్‌స్టాపబుల్’ షోలో. అక్కడ రణబీర్ కపూర్ సరదాగా “నన్ను కూడా స్పిరిట్ యూనివర్స్‌లో పెట్టండి, ఏదో ఒక పాత్ర ఇప్పించండి” అని వంగాని అడిగాడు. ఆ జోక్‌ని పట్టుకుని బాలీవుడ్ మీడియా ఇప్పుడు రణబీర్ ఈ సినిమాలో ఉన్నాడంటూ సీరియస్ ఆర్టికల్స్ రాసేస్తోంది. కానీ అది కేవలం ఆ షోలో జరిగిన సరదా సంభాషణే తప్ప, సీరియస్ ప్లాన్ కాకపోవచ్చు.

దీనికి ముందు మెగాస్టార్ చిరంజీవి ఇందులో ప్రభాస్ తండ్రిగా నటిస్తున్నారని, సంజయ్ దత్ విలన్ అని రకరకాల పుకార్లు వచ్చాయి. అవన్నీ అబద్ధమని వంగా అప్పుడే కొట్టిపారేశాడు. ఇప్పుడు మళ్ళీ ఈ యూనివర్స్ అంటూ లేనిపోని హైప్ క్రియేట్ చేయడం వల్ల, ఆడియన్స్ రాంగ్ ఎక్స్‌పెక్టేషన్స్‌తో థియేటర్‌కి వచ్చే ప్రమాదం ఉంది. లేనిది ఉన్నట్టు ఊహించుకుని వెళ్తే, ఉన్నది కూడా నచ్చకుండా పోయే ఛాన్స్ ఉంది.

ఇక టెక్నికల్‌గా ఆలోచిస్తే ఈ ‘వంగా యూనివర్స్’ అస్సలు సాధ్యం కాదు. ఎందుకంటే ‘యానిమల్’లో జోయాగా నటించిన త్రిప్తి డిమ్రీ, ఇప్పుడు ‘స్పిరిట్’లో మెయిన్ హీరోయిన్. ఒకవేళ ఈ రెండు సినిమాలు ఒకే ప్రపంచంలో ఉంటే, ఒకే ముఖం ఉన్న అమ్మాయి రెండు వేర్వేరు పాత్రల్లో ఎలా ఉంటుంది? ఈ ఒక్క లాజిక్ చాలు, స్పిరిట్ అనేది ‘యానిమల్ పార్క్’కి లింక్ లేని సపరేట్ సినిమా అని చెప్పడానికి.

కాబట్టి ‘స్పిరిట్’ అనేది ఒక స్టాండలోన్ మాస్ కాప్ డ్రామా అని ఫిక్స్ అవ్వడమే బెటర్. రణబీర్ వస్తాడు, యానిమల్ క్రాస్ ఓవర్ ఉంటుంది అని అతిగా ఆశలు పెట్టుకుంటే తర్వాత నిరాశ తప్పదు. ప్రభాస్ ఖాకీ డ్రెస్ వేస్తే వచ్చే కిక్ చాలు, వేరే హంగులు అక్కర్లేదు. ప్రస్తుతానికి ఈ యూనివర్స్ వార్తలన్నీ ఉత్తిత్తి గాసిప్సే అని అర్థం చేసుకోవాలి.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus