Spirit: స్టార్లు వద్దు.. ‘ఆకలి’తో ఉన్న నటులే కావాలి! సందీప్ లాజిక్ ఇదే!

సందీప్ రెడ్డి వంగ సినిమా తీస్తున్నాడంటే, ఆడియన్స్‌ కళ్లు కేవలం కథపైనే కాదు, అతని క్యాస్టింగ్‌పై కూడా ఉంటాయి. ‘స్పిరిట్’ కోసం ప్రభాస్‌ను లాక్ చేయడం సంచలనం అయితే, ఇప్పుడు విలన్ (కీలకపాత్ర) కోసం వివేక్ ఒబెరాయ్‌ను ఎంచుకోవడం మరో పెద్ద షాక్. ప్రభాస్ లాంటి పాన్ ఇండియా స్టార్‌కు పోటీగా, ఫామ్‌లో లేని వివేక్‌ను తీసుకోవడం ఏమిటని ఫ్యాన్స్ అయోమయంలో పడ్డారు.

Spirit

ప్రస్తుత ట్రెండ్ ప్రకారం, ‘KGF’లో సంజయ్ దత్, ‘పుష్ప’లో ఫహద్ ఫాసిల్ లాంటి భారీ స్టార్లను విలన్లుగా పెడుతున్నారు. ఫ్యాన్స్ కూడా ‘స్పిరిట్’ కోసం అలాంటి పెద్ద పేరునే ఊహించారు. కానీ సందీప్ ఎప్పుడూ ట్రెండ్‌ను ఫాలో అవ్వడు, ట్రెండ్‌ను క్రియేట్ చేస్తాడు. ఆయన క్యాస్టింగ్ లాజిక్ చాలా భిన్నంగా ఉంటుంది.. ఆయనకు స్టార్లు వద్దు, ‘ఆకలి’తో ఉన్న నటులే కావాలి.

‘యానిమల్’ సినిమాకు ముందు బాబీ డియోల్ పరిస్థితీ ఇదే. మార్కెట్ మొత్తం మర్చిపోయిన టైమ్‌లో, సందీప్ ఆయనకు లైఫ్ ఇచ్చాడు. ఎందుకంటే, కెరీర్‌లో పెద్ద బ్రేక్ కోసం ఎదురుచూస్తున్న నటులు, తమను తాము నిరూపించుకోవడానికి దర్శకుడికి పూర్తిగా సరెండర్ అవుతారు. పాత్ర కోసం ఎంతటి రిస్క్ అయినా తీసుకుంటారు. స్టార్‌డమ్ ఉన్న నటులతో ఈ ఫ్లెక్సిబిలిటీ ఉండకపోవచ్చు.

వివేక్ ఒబెరాయ్ ఈ కేటగిరీకి పర్ఫెక్ట్‌గా సరిపోతాడు. ‘రక్త చరిత్ర’, ‘కంపెనీ’ లాంటి సినిమాల్లో ఆయన నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కానీ, సరైన బ్రేక్ కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్నాడు. ఇప్పుడు ‘స్పిరిట్’ రూపంలో దక్కిన అవకాశాన్ని ఆయన వదులుకోడు. సందీప్ ఆ పాత్రను ఎంత ఇంటెన్స్‌గా చెక్కితే, వివేక్ అంతకుమించి నటించడానికి సిద్ధంగా ఉంటాడు.

కాబట్టి, సందీప్ ఉద్దేశం కేవలం పాత యాక్టర్లను రీ లాంచ్ చేయడం కాదు. తన పాత్రలోని క్రూరత్వానికి, ఎమోషన్‌కు 100% న్యాయం చేసేయాక్టర్ను ఎంచుకోవడం. అందుకే, ఇది రిస్క్ కాదు, పక్కా లెక్కలతో వేసిన మాస్టర్ ప్లాన్. బాబీ డియోల్ లాగే, వివేక్ ఒబెరాయ్ కూడాస్పిరిట్తో కెరీర్ బెస్ట్ కమ్ బ్యాక్ ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది.

‘హిట్ అండ్ రన్’ కేసులో చిక్కుకున్న బిగ్ బాస్ బ్యూటీ

 

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus