‘కార్తీక దీపం’ నటికి కరోనా కాటు?

కొంతమంది బుల్లితెర నటీనటులు ఈమధ్య కాలంలో కరోనా వైరస్ భారిన పడిన సందర్భాలను మనం చూస్తూనే వచ్చాం. ప్రభాకర్, ‘ఆమెకథ’ హీరో అలాగే ‘బిగ్ బాస్3’ ఫేమ్ రవి, ‘ఆమెకథ’ సీరియల్ హీరోయిన్ నవ్య వంటి వారికి కరోనా సోకిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం వాళ్ళు పూర్తిగా కోలుకున్నారు లెండి. అయితే సీరియల్ షూటింగ్ లో పాల్గొంటున్న వారందరూ భయందోళనకు గురవుతున్నారు. ఇదిలా ఉండగా.. ‘కార్తీక దీపం’ సీరియల్ నుండీ ఓ నటి తప్పుకుంటే.. ఆమెకు కూడా కరోనా సోకిందనే ప్రచారం జరిగింది.

వివరాల్లోకి వెళితే… ‘కార్తీక దీపం’ సీరియల్ లో శ్రావ్య అనే పాత్ర పోషిస్తున్న సంగీత కామత్ కొన్ని కారణాల వల్ల ఈ సీరియల్ నుండీ తప్పుకుంది. దాంతో.. ‘ఆమెకు కరోనా సోకి ఉంటుంది.. అందుకే ఆమెను తీసేసారేమో’ అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే ఆ ప్రచారంలో ఎంత మాత్రం నిజం లేదు. సంగీత కామత్.. మరో రెండు సీరియల్స్ లో కూడా బిజీగా ఉండడం వల్ల.. తప్పనిసరి పరిస్థితుల్లో ‘కార్తీక దీపం’ సీరియల్ నుండీ తప్పుకుందట.. అంతే..! ఇక ఈమె ప్లేస్ లో నిహారిక అనే నటిని.. శ్రావ్య పాత్రకు తీసుకున్నారు.

ఇక సంగీత.. ‘కార్తీక దీపం’ సీరియల్ లో వంటలక్క చెల్లెలుగా నటిస్తూ వచ్చింది. మొదట్లో ఆమె పాత్ర నెగిటివ్ గా ఉండేది.. అయితే గత 100 ఎపిసోడ్ల నుండీ పాజిటివ్ గా మారినట్టు చూపిస్తున్నారు. నెగిటివ్ రోల్ లో సంగీత చాలా అద్బుతంగా నటించింది. ఇప్పుడు పాజిటివ్ గా నటిస్తున్న టైంలో ఆమెను తొలగించడం ‘కార్తీక దీపం’ అభిమానులను కొంత నిరాశకు గురి చేసినట్టు అయ్యింది.

Most Recommended Video

పవర్ స్టార్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఎస్.ఎస్.రాజమౌళి సినిమాల IMDB రేటింగ్స్!
తెలుగు సినిమాల్లో నటించిన 27 బాలీవుడ్ హీరోయిన్లు ఎవరో తెలుసా?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus