క్యాస్టింగ్ కౌచ్ పై సంజన స్పందన

  • July 5, 2018 / 09:41 AM IST

ప్రభాస్, పూరి జగన్నాథ్ కలయికలో రూపుదిద్దుకున్న “బుజ్జిగాడు” చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు సంజన పరిచయమైంది. ఆ తర్వాత తెలుగులో మంచి విజయాలు లేకపోయినప్పటికీ కన్నడలో అనేక విజయాలు సొంతం చేసుకుంది. రీసెంట్ గా వచ్చిన “దండుపాళ్యంత 3” లోను ఓ కీలక పాత్ర చేశారు. వీటన్నిటి కన్నా బాహుబలి నిర్మాతలు నిర్మించిన “స్వర్ణఖడ్గం”లో యువరాణిగా నటించి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయింది. ఈ సందర్భంగా మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో అనేక సంగతులు చెప్పింది. అలాగే ప్రస్తుతం హాట్ టాపిక్ అయిన క్యాస్టింగ్ కౌచ్ పై సంజన తన అభిప్రాయాన్ని వెల్లడించింది.

“నిరాశలో కూరుకుపోయి, ఏది చేయడానికైనా సిద్ధంగా ఉన్న అమ్మాయిలను చూసినప్పుడే క్యాస్టింగ్‌ కౌచ్‌ బయటకు వస్తుంది. అలాంటి వారినే కొందరు లోబరుచుకుంటారు. ఒక మంచి దర్శకుడు, నిర్మాత ఒక అమ్మాయి ప్రేమను పొందడానికి 100 కోట్ల ప్రాజెక్టులో పెట్టలేరు. కొంతమంది నకిలీ నిర్మాతలు “‘అలా చేస్తేనే మీకు అవకాశం వస్తుంది” అని అవకాశాలకోసం వచ్చేవారికి చెబుతుంటారు. అసలు వాళ్లు ఇండస్ట్రీకి చెందినవారే కాదు. ‘నేను ఫలానా సినిమాకు ప్రొడ్యూసర్‌ని, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌ని, ఫైనాన్షియర్‌ని’ అని చెప్పి అమ్మాయిలను పడేస్తారు.” అని సంజన వెల్లడించింది. అలాగే అటువంటి వారి విషయంలో అమ్మాయిలు చాలా జాగ్రత్తగా ఉండాలని సూచించింది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus