Sanjay Dutt: డబుల్ ఇస్మార్ట్ మూవీ కోసం ఆ రేంజ్ లో ఖర్చు చేస్తున్నారా?

టాలీవుడ్ టాప్, టాలెంటెడ్ హీరోలలో ఒకరైన రామ్ కు ప్రస్తుతం కెరీర్ పరంగా బ్లాక్ బస్టర్ హిట్ అవసరమనే సంగతి తెలిసిందే. రామ్ నటించిన స్కంద మూవీ ప్రస్తుతం డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతుండగా ఈ సినిమాకు రికార్డ్ స్థాయిలో వ్యూస్ వస్తున్నాయి. రామ్ ప్రస్తుతం పూరీ జగన్నాథ్ డైరెక్షన్ లో డబుల్ ఇస్మార్ట్ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాలో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో సంజయ్ దత్ కనిపించనున్నారు.

ఈ సినిమా కోసం సంజయ్ దత్ రెమ్యునరేషన్ భారీ రేంజ్ లో ఉందని తెలుస్తోంది. ఈ సినిమా కోసం ఆరు కోట్ల రూపాయల రేంజ్ లో ఆయన పారితోషికం అందుకుంటున్నారని సమాచారం అందుతోంది. ఈ మధ్య కాలంలో సంజయ్ దత్ నటించిన ప్రతి సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలుస్తున్న నేపథ్యంలో ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద అదే మ్యాజిక్ ను రిపీట్ చేస్తుందని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.

సంజయ్ దత్ (Sanjay Dutt) తన పర్ఫామెన్స్ తో సినిమాలపై అంచనాలను పెంచుతూ ప్రేక్షకులకు దగ్గరవుతున్నారు. ఇస్మార్ట్ శంకర్ సినిమాకు సీక్వెల్ గా ఈ సినిమా తెరకెక్కుతుండగా ఈ సినిమా ప్రేక్షకులను ఏ స్థాయిలో మెప్పిస్తుందో చూడాలి. పూరీ జగన్నాథ్ ఈ సినిమాతో సక్సెస్ ట్రాక్ లోకి రావాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. పూరీ జగన్నాథ్ సొంత బ్యానర్ లో ఈ సినిమా తెరకెక్కుతోంది.

పూరీ జగన్నాథ్ కు ఈ సినిమాతో పూర్వ వైభవం రావాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. కేజీఎఫ్, లియో, జవాన్ సినిమాల సక్సెస్ లో సంజయ్ దత్ పాత్ర ఎంతో ఉంది. పాన్ ఇండియా మూవీగా మార్చి నెల 8వ తేదీన ఈ సినిమా రిలీజ్ కానుంది. వరుస అవకాశాలతో బిజీగా ఉన్న సంజయ్ దత్ నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్నారు. సంజయ్ దత్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ అంచనాలకు మించి పెరుగుతోంది. డబుల్ ఇస్మార్ట్ మూవీ బడ్జెట్ 60 కోట్ల రూపాయల కంటే ఎక్కువని భోగట్టా.

మా ఊరి పొలిమేర 2 సినిమా రివ్యూ & రేటింగ్!

కీడా కోలా సినిమా రివ్యూ & రేటింగ్!
నరకాసుర సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus