గుర్తు పట్టలేనంతగా మారిన సంజన.!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ బుజ్జిగాడు సినిమాలో త్రిషకు చెల్లెలుగా అందంగా ఆకట్టుకున్న సంజన రూట్ మార్చింది. డీ గ్లామరైజ్ పాత్రలోనూ మెప్పించడానికి సిద్ధమైంది. ఇందుకోసం పూర్తిగా తనను తాను మార్చుకుంది. గతంలో సంచలనం సృష్టించిన దండుపాళ్యం చిత్రానికి సీక్వెల్ గా వస్తున్న దండుపాళ్యం -2 లో దోపిడీ ముఠా సభ్యురాలిగా కనిపించనుంది. ఇందులో చంద్రి పాత్రలో అద్భుత నటనను ప్రదర్శించనుంది.

కొన్నిరోజుల క్రితం ఈ మూవీకి సంబంధించిన కొన్ని ఫోటోలను చిత్ర బృందం విడుదల చేసింది. అందులో సంజనకు చూసి అందరూ ఆక్చర్య పోతున్నారు. ఈ చిత్రంతో ఆమెకు మరిన్ని అవకాశాలు రావడం ఖాయమని సినీ విమర్శకులు చెబుతున్నారు. సంజన ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తుందనడంలో సందేహం లేదంటున్నారు. దర్శకుడు శ్రీనివాసరాజు తెలుగు, కన్నడ భాషల్లో తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో పూజాగాంధీ, రఘు ముఖర్జీ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ ప్రత్యేక పాత్ర పోషిస్తోన్న ఈ చిత్రాన్ని వెంకట్ మూవీస్ బ్యానర్ పై వెంకట్ నిర్మిస్తున్నారు.

ప్రొడక్షన్ వర్క్ పూర్తిచేసుకున్నఈ ఫిల్మ్ ఆగస్టులో రిలీజ్ కానుంది. దండుపాళ్యం -2 సంజన కెరీర్ ని ఎంతవరకు మలుపు తిప్పుతోందో తెలుసుకోవాలంటే మరో నెల రోజుల పాటు ఆగాల్సిందే.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus