ఏప్రిల్‌లో మరోసారి పొంగల్‌ సమస్య తీసుకొస్తారా!

  • January 19, 2022 / 11:05 AM IST

టాలీవుడ్‌ ఇప్పటివరకు చూసిన సంక్రాంతి వేరు… ఈ ఏడాది చూసిన సంక్రాంతి వేరు. పొంగల్ ఫైట్‌కి సిద్ధం అంటూ ఆరేడు నెలల క్రితం ప్రకటించిన సినిమాలు తీరా ఆ తేదీ వచ్చేసరికి ముఖం చాటేశాయి. రెండు నెలల ముందు ‘మేం రెడీ’ అని చెప్పిన సినిమా కూడా ‘తూచ్‌’ అనేసింది. అయితే అప్పటివరకు చర్చలో లేని సినిమాలు వచ్చి విజయాలు అందుకున్నాయి. సంక్రాంతి విజేతలు అయిపోయాయి. అయితే సంక్రాంతికి జరగాల్సిన ఫైట్‌ ఇప్పుడు సమ్మర్‌కి వెళ్తోంది.

ముందు జరిగింది చూద్దాం… ఆ తర్వాత జరగబోయేది చూద్దాం. కరోనా సెకండ్‌ వేవ్‌ తర్వాత పెద్ద సినిమాలు, ఓ మోస్తరు సినిమాలు వరుసగా రిలీజ్‌ డేట్లు అనౌన్స్‌ చేస్తూ వచ్చాయి. అలా ‘భీమ్లా నాయక్‌’, ‘రాధేశ్యామ్‌’, ‘సర్కారు వారి పాట’ సినిమాలు 2022 సంక్రాంతి అని చెప్పేశాయి. అయితే అనూహ్యంగా ‘ఆర్‌ఆర్ఆర్‌’ టీమ్‌ ‘మేమున్నాం’ అంటూ వచ్చి జనవరి 7 అని డేట్‌ ప్రకటించాయి. ఇన్ని పెద్ద సినిమాలు ఒకేసారి వస్తే ఇబ్బంది అనుకుని నిర్మాతలందరూ కలసి మాట్లాడుకుని ‘భీమ్లా నాయక్‌’ను ఫిబ్రవరి 25కి వాయిదా వేయించాయి. పరిస్థితిని ముందుగానే అర్థం చేసుకున్న ‘సర్కారు వారి పాట’ ఏప్రిల్‌ 1కి వెళ్లిపోయింది.

ఆ తర్వాత కరోనా మూడో వేవ్‌ వచ్చింది. సినిమా పరిశ్రమ పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుక అయ్యింది. ఎటూ పాలుపోని పాన్‌ ఇండియా సినిమాలు ‘ఆర్‌ఆర్ఆర్‌’, ‘రాధేశ్యామ్‌’ వాయిదాల బాట పట్టాయి. దీంతో సంక్రాంతి ఫైట్‌ చప్పగా మారిపోయింది. అయితే ఈసారి ‘బంగార్రాజు’ డేరింగ్‌ స్టెప్‌ వేశాడు. సంక్రాంతికి వచ్చి… పెద్ద సినిమా లేని లోటు తీర్చాడు. మంచి విజయం కూడా అందుకున్నారు. వచ్చిన మిగిలిన చిన్న సినిమాలు వచ్చాయంతే.

ఇప్పుడు జరగబోయేది చూద్దామా… సంక్రాంతికి వస్తామంటూ వాయిదా పడ్డ సినిమాలు, ఆ తర్వాత రావాల్సిన సినిమాలు ఇప్పుడు సమ్మర్‌ బాటపట్టాయి. ఈ సారి తొలి అడుగు ‘ఆచార్య’ వేసేశాడు. ఏప్రిల్‌ 1 అంటూ డేట్‌ అనౌన్స్‌ చేశాడు. దీంతో ఈ సమ్మర్‌ పోరు ఏప్రిల్‌ 1 నుండే మొదలవుతుంది. ఇక మిగిలిన సినిమాలు డేట్లు ఏంటి అనేది ఇప్పుడు విషయం. ఏప్రిల్ 14న ‘కేజీఎఫ్‌ 2’ రిలీజ్‌ చేస్తున్నట్లు మొన్ననే ప్రకటించారు. దీంతో మిగిలినవాళ్లకు ఆఖరి రెండు వారాలు ఉన్నాయి.

ఈ రెండు వారాలు, మేలోని నాలుగు వారాలు ఈ సినిమాలు సర్దుకోవాలి. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ వచ్చాక కనీసం రెండు వారాలు సినిమాలు రాకుండా చూసుకుంటారు అనడంతో అతిశయోక్తి లేదు. ఆ సినిమా పక్కనపెడితే ‘రాధేశ్యామ్‌’ పరిస్థితి తేలాల్సి ఉంది. ఇవి కాకుండా ఫిబ్రవరి, మార్చిలో రావాల్సిన ఇంకొన్ని సినిమాలు వాయిదా అంటున్నారు. మరి వాటికి డేట్స్‌ పరిస్థితేంటో. ఇదంతా చూస్తుంటే సంక్రాంతికి జరగాల్సిన ఫైట్‌, సమ్మర్‌కి పోస్ట్‌ పోన్‌ అయినట్లుంది.

బంగార్రాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!
ఎన్టీఆర్ టు కృష్ణ.. ఈ సినీ నటులకి పుత్రశోఖం తప్పలేదు..!
20 ఏళ్ళ ‘టక్కరి దొంగ’ గురించి ఎవ్వరికీ తెలియని కొన్ని విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus