Sankranti Movies: వచ్చినట్లే వచ్చి వెనక్కి వెళ్లిపోతున్న సినిమాలు!

సంక్రాంతికి చిన్న సినిమాల జాతర… ఈ మాట మూడు రోజుల ముచ్చటే అయిపోయింది. అదేంటి సినిమాల విడుదల అవ్వడం లేదా? అంటే అవును అనే సమాధానమే వస్తుంది. ఎందుకంటే ఈ సంక్రాంతికి సుమారు 10 సినిమాలు విడుదలవుతాయి అంటూ… ఇలా అనుకున్నామో లేదో, అలా సినిమాల విడుదల వాయిదా అంటూ వార్తలొస్తున్నాయి. ఈ లెక్కన ఈ సంక్రాంతికి కేవలం మూడు సినిమాలే విడుదలవుతాయి అని అంటున్నారు. ఈ లెక్కలో తమిళ సినిమాలు కూడా ఉన్నాయి.

సంక్రాంతి సీజన్‌ను జనవరి 7నే షురూ చేయాలని ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ అనుకుంది. అయితే కరోనా రాసిన స్క్రీన్‌ప్లే, ట్విస్ట్‌లతో రాజమౌళి దెబ్బతిన్నారు. సినిమా మరోసారి వాయిదా వేశారు. ఇలా ఆ సినిమా వాయిదా అనౌన్స్‌ చేశారో లేదో, ‘రాధేశ్యామ్‌’ కూడా వాయిదా అని ఫిక్స్‌ అయిపోయి వరుసగా చిన్న సినిమాలు, ఓ మోస్తరు సినిమాలు రిలీజ్‌ డేట్‌లు అనౌన్స్‌ చేశాయి. ఒకదాని తర్వాత ఒకటి సంక్రాంతిని టార్గెట్‌ చేసుకుంటూ వచ్చేశాయి. జనవరి 14, జనవరి 15 అంటూ అనౌన్స్ చేసేశాయి. అయితే ఇప్పుడు అదే జోరులో వెనక్కి వెళ్లిపోతున్నాయి. ఆ లెక్కన మూడు సినిమాలే రంగంలో నిలిచాయి.

ముందుగా సంక్రాంతి బరిలో ఉన్న సినిమాల పేర్లు చూద్దాం. నాగార్జున – నాగచైతన్య ‘బంగార్రాజు’ పక్కాగా ఉంటుంది. ఆ మాటకొస్తే ఈ సంక్రాంతి హీరోలు వాళ్లే అంటున్నారు కూడా. ఆ విషయం పక్కనపెడితే… దిల్‌ రాజు వారసుడు ఆశిష్‌ – అనుపమ పరమేశ్వరన్‌ల ‘రౌడీ బాయ్స్‌’ సంక్రాంతికే వస్తుంది. ఈ రెండూ కాకుండా అశోక్‌ గల్లా అరంగేట్ర చిత్రం ‘హీరో’ వస్తుంది అంట. ‘బంగార్రాజు’, ‘రౌడీ బాయ్స్’ జనవరి 14న వస్తే.. తర్వాతి రోజు ‘హీరో’ థియేటర్లలోకి వస్తాడు. సిద్దు జొన్నలగడ్డ. ‘dj టిల్లు’ ఉన్నాయి. మిగిలిన సినిమాలన్నీ వాయిదా పడినట్లే అంటున్నారు.

ఇప్పుడు వస్తాయి అని చెప్పిన వాయిదా పడిన సినిమాల సంగతి చూద్దాం. అజిత్‌ ‘వలిమై’, విశాల్‌ ‘సామాన్యుడు’, రాజశేఖర్‌ ‘శేఖర్‌’, ఎంఎస్‌ రాజు ‘7 డేస్‌ 6 నైట్స్‌’ ఉన్నాయి. వీటితోపాటు మరికొన్ని చిన్న సినిమాలు కూడా ఇలా వాయిదా పడిన సినిమాల్లో ఉన్నాయి. అయితే… ‘dj టిల్లు’ సినిమా వాయిదా వేశారని వార్తలు వస్తున్నాయి. చిత్రబృందం నుండి అధికారికంగా ఎలాంటి ప్రకటన లేదు.

2021.. ఇండస్ట్రీని వివాదాలతో ముంచేసింది!

Most Recommended Video

ఈ ఏడాది హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చిన భామల లిస్ట్..!
ఈ ఏడాది ప్లాపుల నుండీ బయటపడ్డ హీరోలు ఎవరో తెలుసా?
ఈ ఏడాది వివాహం చేసుకున్న సినీ సెలబ్రిటీలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus