విక్రాంత్ (Vikranth), చాందినీ చౌదరి (Chandini Chowdary) జంటగా నటించిన చిత్రం ‘సంతాన ప్రాప్తిరస్తు’ (Santhana Prapthirasthu). త్వరలో రిలీజ్ కాబోతున్న ఈ సినిమా టీజర్ ను స్టార్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేశారు. ‘సంతాన ప్రాప్తిరస్తు’ టీజర్ విషయానికి వస్తే ఇది.. 2 నిమిషాల 11 సెకన్ల నిడివి కలిగి ఉంది. సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేసుకునే హీరో. అతను వర్క్ స్ట్రెస్ తో బాధపడుతున్న తరుణంలో కళ్యాణి(చాందినీ చౌదరి) అనే అమ్మాయి అతనికి పరిచయం అవ్వడం. ఆమెతో ప్రేమలో పడటం జరుగుతుంది.
కానీ వీరి పెళ్లికి ఇరు కుటుంబ సభ్యుల నుండి అంగీకారం లభించదు. దీంతో ఇద్దరూ పెద్దలకి చెప్పకుండా పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అవుతారు. పెళ్లి తర్వాత హీరోయిన్ ను వంద రోజుల్లో ప్రెగ్నెంట్ అయితే కుటుంబ సభ్యులు దగ్గరికి తీసుకుంటారు అనేది హీరో ప్లాన్. కాకపోతే అతనికి స్పెర్మ్ కౌంట్ తక్కువగా ఉండటం వల్ల.. ప్లాన్ ఫెయిల్ అవుతుంది. మరోపక్క అతని భార్యతో నిత్యం గొడవలు వస్తాయి. తర్వాత ఏమైంది? అనే ఆసక్తి రేకెత్తిస్తూ టీజర్ ను కట్ చేశారు.
టీజర్లో కామెడీ బాగుంది. దర్శకుడు సంజీవ్ రెడ్డి యూత్ కి కనెక్ట్ అయ్యే పాయింట్ ను ఎంపిక చేసుకుని.. దానిని వినోదాత్మకంగా చెప్పాలని ప్రయత్నిస్తున్నట్టు స్పష్టమవుతుంది. మధుర శ్రీధర్ రెడ్డి,నిర్వి హరి ప్రసాద్ రెడ్డి నిర్మాతలు. ఈ టీజర్ కి ఇంకో హైలెట్ సాయి కృష్ణ గనాల ఎడిటింగ్ అని చెప్పాలి. ఈ మధ్య కాలంలో సినిమా కంటెంట్ ను ఇంత అందంగా ప్రేక్షకులకి ప్రజెంట్ చేసిన టీజర్ ఇంకోటి రాలేదు. అంత అందంగా సాయి కృష్ణ టీజర్ ను కట్ చేయడం విశేషంగా చెప్పుకోవాలి. మీరు కూడా ఓ లుక్కేయండి :