రవితేజ, సంతోష్ శ్రీనివాస్ సినిమా కథపై క్లారిటీ.!

సోగ్గాడే చిన్ని నాయన, రారండోయ్ వేడుక చూద్దాం విజయాల తర్వాత కళ్యాణ్ కృష్ణ.. రవితేజతో నేల టికెట్ అనే మూవీ చేస్తున్నారు. దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా వచ్చేనెల 24న రిలీజ్ కానుంది.  ఎస్‌ఆర్‌టీ మూవీస్‌ పతాకంపై రామ్ తాళ్లూరి ఈ సినిమాని ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా నిర్మిస్తున్నట్లు ఫస్ట్ లుక్, టీజర్లు స్పష్టంచేశాయి. దీని తర్వాత శ్రీను వైట్ల దర్శకత్వంలో రవితేజ నటించనున్నారు. “అమర్ అక్బర్ ఆంటోనీ” అనే టైటిల్ ఫిక్స్ చేసిన ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం అమెరికాలో జరుగుతోంది. ఈ మూవీ షూటింగ్ లో రవితేజ త్వరలో జాయిన్ కానున్నారు. ఈ చిత్రం తర్వాత కూడా రెండు ప్రాజక్ట్ లు లైన్లో ఉన్నాయి.

అందులో సంతోష్ శ్రీనివాస్ (కందిరీగ ఫేమ్ ) దర్శకత్వంలో సినిమాను ముందుగా పట్టాలెక్కించనున్నట్టు టాక్.  ఈ చిత్రం తమిళ స్టార్ హీరో విజయ్ చేసిన “తేరి” సినిమాకు రీమేక్ గా రూపొందనుందని ప్రచారం జరుగుతోంది. ఈ వార్తలను సంతోష్ శ్రీనివాస్ బృందం ఖండించింది. ‘తేరి’ నుంచి లైన్ తీసుకున్న విషయం నిజమే కానీ.. కథ, కథనాల్ని మొత్తం మన నేటివిటీకి అనుగుణంగా మార్చుకున్నట్లు వెల్లడించింది. మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మించనున్న ఈ మూవీలో రవితేజ సరసన  కాజల్ అగర్వాల్. క్యాథరిన్ నటించనున్నారు. జూలై లో ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లే అవకాశాలున్నాయి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus