Saptha Sagaralu Dhaati Collections: ‘సప్త సాగరాలు దాటి’ ఫస్ట్ డే కలెక్షన్స్ ఎలా ఉన్నాయంటే?

కన్నడ స్టార్ హీరో రక్షిత్ శెట్టి.. ‘అతడే శ్రీమన్నారాయణ’ ‘ఛార్లీ’ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు కూడా దగ్గరయ్యాడు. ఆ సినిమాలు తెలుగులో కూడా బాగా కలెక్ట్ చేశాయి. కన్నడలో అయితే భారీగా లాభాలు అందించాయి. దీంతో అతను నటించిన ‘సప్త సాగరాలు దాటి’ అనే చిత్రాన్ని తెలుగులో కూడా గ్రాండ్ గా రిలీజ్ చేసింది ‘పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ’. సెప్టెంబర్ 1 న ఈ సినిమా కన్నడంలో రిలీజ్ అవ్వగా.. తెలుగులో మాత్రం సెప్టెంబర్ 22న రిలీజ్ అయ్యింది.

మొదటి రోజు ఈ సినిమాకి (Saptha Sagaralu Dhaati) సూపర్ హిట్ టాక్ వచ్చింది. రివ్యూస్ కూడా చాలా పాజిటివ్ గా వచ్చాయి. ఫస్టాఫ్ చాలా బాగున్నప్పటికీ.. సెకండ్ హాఫ్ ఆరంభం చాలా స్లోగా ఉందని, ట్రాజెడీ ఎక్కువైంది అనే కామెంట్లు రాగా, క్లైమాక్స్ మళ్ళీ కొత్త ఫీలింగ్ ను కలిగించాయి. మరీ ముఖ్యంగా సినిమా అయిపోయాక సెకండ్ పార్ట్ గురించి రుచి చూపిస్తూ ప్రదర్శించిన గ్లింప్స్ కూడా అందరినీ మెప్పించింది. దీంతో సెకండ్ పార్ట్ పై కూడా ఆసక్తి పెరుగుతుంది అనడంలో అతిశయోక్తి లేదు.

అయితే ఇది పక్కా క్లాస్ మూవీ..! రెగ్యులర్ సినిమాలా ఉండదు. మాస్ ఆడియన్స్ కి ఈ సినిమా అస్సలు ఎక్కే అవకాశం లేదు. అందుకేనేమో కలెక్షన్స్ మాత్రం చాలా దారుణంగా నమోదయ్యాయి. రివ్యూస్ ఎంత పాజిటివ్ గా వచ్చినా టికెట్లు తెగడం లేదు. మొదటి రోజు ఈ సినిమా కేవలం రూ.15 లక్షల గ్రాస్ ను మాత్రమే రాబట్టింది. అందులో షేర్ కూడా రూ.6 లక్షల వరకు మాత్రమే ఉంటుంది అని ట్రేడ్ పండితుల సమాచారం.

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రియాంక జైన్ గురించి 10 ఆసక్తికర విషయాలు..!

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ దామిని భట్ల గురించి 10 ఆసక్తికర విషయాలు!
‘బిగ్ బాస్ 7’ 14 మంది కంటెస్టెంట్స్ పారితోషికాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus