Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Movie News » నవంబర్ 21న ‘సారంగపాణి జాతకం’ టీజర్ విడుదల

నవంబర్ 21న ‘సారంగపాణి జాతకం’ టీజర్ విడుదల

  • November 18, 2024 / 05:13 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

నవంబర్ 21న ‘సారంగపాణి జాతకం’ టీజర్ విడుదల

మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో శ్రీదేవి మూవీస్ పతాకంపై శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మిస్తున్న సినిమా ‘సారంగపాణి జాతకం’. ఇందులో ప్రియదర్శి సరసన తెలుగమ్మాయి రూప కొడువాయూర్ కథానాయికగా నటించారు. ‘జెంటిల్‌మన్’, ‘సమ్మోహనం’ విజయాల తర్వాత మోహనకృష్ణ ఇంద్రగంటి, శివలెంక కృష్ణప్రసాద్ కలయికలో రూపొందుతున్న మూడో చిత్రమిది. డిసెంబర్ 20వ తేదీన సినిమా విడుదల చేయనున్నారు. నవంబర్ 21, ఉదయం 11:12 కి టీజర్ విడుదల చేయనున్నట్లు ఈ రోజు వెల్లడించారు.

శివలెంక కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ… ”ఈ నెల 21వ తేదీన ఉదయం 11:12 గంటలకు మా ‘సారంగపాణి జాతకం’ టీజర్ విడుదల చేయనున్నాం. ప్రేక్షకులకు మా సారంగపాణి ప్రపంచం ఎలా ఉంటుందో ఆ రోజు పరిచయం చేస్తాం. సినిమా చిత్రీకరణ సెప్టెంబర్ మొదటి వారంలో పూర్తి చేశాం. డబ్బింగ్ కార్యక్రమాలు సైతం పూర్తి అయ్యాయి. పోస్ట్ ప్రొడక్షన్ పనులు తుది దశకు చేరుకున్నాయి. ప్రస్తుతం రీ రికార్డింగ్ పనులు జరుగుతున్నాయి. మనిషి భవిష్యత్తు చేతి రేఖల్లో ఉంటుందా? లేదా చేసే చేతల్లో ఉంటుందా? అనే ప్రశ్నకు జవాబు ఇచ్చే ఓ పరిపూర్ణ హాస్యరస చిత్రమిది. ఇంటిల్లిపాది చూసి నవ్వుకునే వినోదాత్మక సినిమా. మోహనకృష్ణ ఇంద్రగంటి అద్భుతంగా తీశారు. ఏడాది ఆఖరులో అందరినీ నవ్విస్తుందీ సినిమా” అని అన్నారు.

ప్రియదర్శి పులికొండ, రూప కొడువాయూర్ జంటగా నటించిన ఈ సినిమాలో నరేష్ విజయకృష్ణ, తనికెళ్ళ భరణి, శ్రీనివాస్ అవసరాల, ‘వెన్నెల’ కిశోర్, ‘వైవా’ హర్ష, శివన్నారాయణ, అశోక్ కుమార్, రాజా చెంబోలు, వడ్లమాని శ్రీనివాస్, ప్రదీప్ రుద్ర, రమేష్ రెడ్డి, కల్పలత, రూప లక్ష్మి, హర్షిణి, కె.ఎల్.కె, మణి, ‘ఐమ్యాక్స్’ వెంకట్ ఇతర ప్రధాన తారాగణం. ఈ చిత్రానికి మేకప్ చీఫ్: ఆర్.కె వ్యామజాల, కాస్ట్యూమ్ చీఫ్: ఎన్. మనోజ్ కుమార్, కాస్ట్యూమ్ డిజైనర్స్: రాజేష్ కామర్సు – అశ్విన్, మార్కెటింగ్: టాక్ స్కూప్, పీఆర్వో: పులగం చిన్నారాయణ, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్స్: కె. రామాంజనేయులు (అంజి బాబు) – పి రషీద్ అహ్మద్ ఖాన్, కో డైరెక్టర్: కోట సురేష్ కుమార్, పాటలు: రామ జోగయ్య శాస్త్రి, స్టంట్స్: వెంకట్ – వెంకటేష్, ప్రొడక్షన్ డిజైనర్: రవీందర్, ఎడిటర్: మార్తాండ్ కె. వెంకటేష్, డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ: పీజీ విందా, సంగీతం: వివేక్ సాగర్, లైన్ ప్రొడ్యూసర్: విద్య శివలెంక, సహ నిర్మాత: చింతా గోపాలకృష్ణా రెడ్డి, నిర్మాత: శివలెంక కృష్ణప్రసాద్, రచన – దర్శకత్వం: మోహనకృష్ణ ఇంద్రగంటి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

Also Read

Pallaburusu Review in Telugu: పళ్ళబురుసు సినిమా రివ్యూ & రేటింగ్!

Pallaburusu Review in Telugu: పళ్ళబురుసు సినిమా రివ్యూ & రేటింగ్!

Makutam Review in Telugu: మకుటం సినిమా రివ్యూ & రేటింగ్!

Makutam Review in Telugu: మకుటం సినిమా రివ్యూ & రేటింగ్!

టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు గారిని మర్యాదపూర్వకంగా కలిసి ఆశీర్వాదాలు తీసుకున్న టీటీడీ ఎస్విబిసి చైర్మన్ శ్రీధర్ వర్మ

టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు గారిని మర్యాదపూర్వకంగా కలిసి ఆశీర్వాదాలు తీసుకున్న టీటీడీ ఎస్విబిసి చైర్మన్ శ్రీధర్ వర్మ

Vishwanath And Sons Review in Telugu: విశ్వ‌నాథ్ అండ్ స‌న్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

Vishwanath And Sons Review in Telugu: విశ్వ‌నాథ్ అండ్ స‌న్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

బిగ్ బాస్ అగ్ని పరీక్ష 2 ఫ్లేమ్ టూర్‌లో కళ్యాణ్ పడాల, డెమాన్ పవన్

బిగ్ బాస్ అగ్ని పరీక్ష 2 ఫ్లేమ్ టూర్‌లో కళ్యాణ్ పడాల, డెమాన్ పవన్

హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాల విజయ పరంపరను ‘అగధ’తో కొనసాగించనున్న కామాక్షి భాస్కర్ల?

హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాల విజయ పరంపరను ‘అగధ’తో కొనసాగించనున్న కామాక్షి భాస్కర్ల?

trending news

Pallaburusu Review in Telugu: పళ్ళబురుసు సినిమా రివ్యూ & రేటింగ్!

Pallaburusu Review in Telugu: పళ్ళబురుసు సినిమా రివ్యూ & రేటింగ్!

6 hours ago
Makutam Review in Telugu: మకుటం సినిమా రివ్యూ & రేటింగ్!

Makutam Review in Telugu: మకుటం సినిమా రివ్యూ & రేటింగ్!

7 hours ago
టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు గారిని మర్యాదపూర్వకంగా కలిసి ఆశీర్వాదాలు తీసుకున్న టీటీడీ ఎస్విబిసి చైర్మన్ శ్రీధర్ వర్మ

టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు గారిని మర్యాదపూర్వకంగా కలిసి ఆశీర్వాదాలు తీసుకున్న టీటీడీ ఎస్విబిసి చైర్మన్ శ్రీధర్ వర్మ

9 hours ago
Vishwanath And Sons Review in Telugu: విశ్వ‌నాథ్ అండ్ స‌న్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

Vishwanath And Sons Review in Telugu: విశ్వ‌నాథ్ అండ్ స‌న్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

17 hours ago
బిగ్ బాస్ అగ్ని పరీక్ష 2 ఫ్లేమ్ టూర్‌లో కళ్యాణ్ పడాల, డెమాన్ పవన్

బిగ్ బాస్ అగ్ని పరీక్ష 2 ఫ్లేమ్ టూర్‌లో కళ్యాణ్ పడాల, డెమాన్ పవన్

18 hours ago

latest news

Vishal: ఆ యూట్యూబర్ల మీద యాక్షన్‌ తీసుకోండి: సీఎంకు విశాల్‌ రిక్వెస్ట్‌

Vishal: ఆ యూట్యూబర్ల మీద యాక్షన్‌ తీసుకోండి: సీఎంకు విశాల్‌ రిక్వెస్ట్‌

9 hours ago
George Krish: కొబ్బరికాయ కొట్టిన రోజే.. టైటిల్‌.. రిలీజ్‌ డేట్‌.. డిస్ట్రిబ్యూటర్‌లు.. ఏంటీ మాస్‌

George Krish: కొబ్బరికాయ కొట్టిన రోజే.. టైటిల్‌.. రిలీజ్‌ డేట్‌.. డిస్ట్రిబ్యూటర్‌లు.. ఏంటీ మాస్‌

9 hours ago
Shakeela: ఫోన్‌ ఎక్కువ సేపు వాడుతున్నారా? షకీలాకు ఏమైందో తెలుసుకోండి మరి!

Shakeela: ఫోన్‌ ఎక్కువ సేపు వాడుతున్నారా? షకీలాకు ఏమైందో తెలుసుకోండి మరి!

9 hours ago
Janhvi Kapoor: మీకు ఫ్యాన్స్‌ వద్దా.. జాన్వీ కపూర్‌కు ఊహించని ప్రశ్న

Janhvi Kapoor: మీకు ఫ్యాన్స్‌ వద్దా.. జాన్వీ కపూర్‌కు ఊహించని ప్రశ్న

14 hours ago
Prabhas: షూటింగ్‌ లేకపోయినా సెట్స్‌కి ప్రభాస్‌.. దానికి బదులు వేరే సినిమాకు డేట్స్‌ ఇవ్వొచ్చుగా

Prabhas: షూటింగ్‌ లేకపోయినా సెట్స్‌కి ప్రభాస్‌.. దానికి బదులు వేరే సినిమాకు డేట్స్‌ ఇవ్వొచ్చుగా

15 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version