కోలీవుడ్ ఇండస్ట్రీలోని ప్రముఖ నటులలో శరత్ కుమార్ ఒకరు కాగా టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా ఈ నటుడికి మంచి పేరుంది. ప్రస్తుతం శరత్ కుమార్ పరిమితంగా సినిమాలలో నటిస్తున్న సంగతి తెలిసిందే. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, విలన్ గా శరత్ కుమార్ సత్తా చాటారు. రాజకీయాల్లో కూడా ఈ నటుడు యాక్టివ్ గా ఉన్నారనే సంగతి తెలిసిందే. తాజాగా శరత్ కుమార్ ఆల్ ఇండియా సమత్తువ మక్క కట్చి వార్షిక మహాసభలలో పాల్గొన్నారు.
మధురైలో జరిగిన ఈ సభలలో శరత్ కుమార్ మాట్లాడుతూ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అయితే రాజకీయ నాయకులు అన్న తర్వాత కచ్చితంగా తమ హామీలతో ప్రజలకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తుంటారు. ఇందుకు సంబంధించి ఏ రాజకీయ నాయకుడు అతీతం కాదు. రాజ్యసభ ఎంపీగా, ఎమ్మెల్యేగా శరత్ కుమార్ కు ఎంతగానో అనుభవం ఉంది. అయితే శరత్ కుమార్ రాష్ట్రంలో తమ పార్టీ అధికారంలోకి వస్తే సంపూర్ణ మద్యపాన నిషేధం అమలు చేస్తానని మద్యం ద్వారా వచ్చే ఆదాయం తమ పార్టీకి అవసరం లేదని తెలిపారు.
నేను 150 సంవత్సరాలు జీవించగలనని ఆయన చెప్పుకొచ్చారు. నా వయస్సు 70 సంవత్సరాలు అయినా 25 సంవత్సరాల యువకుడిలా నేను జీవనం సాగిస్తున్నానని ఆయన కామెంట్లు చేయడం గమనార్హం. నన్ను గెలిపిస్తే 150 సంవత్సరాలు ఏ విధంగా జీవించాలో అనే ట్రిక్ మీకు కూడా చెబుతానని శరత్ కుమార్ పేర్కొన్నారు. భవిష్యత్తులో తమిళనాడులో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఆల్ ఇండియా సమత్తువ మక్క కట్చి పార్టీ సభ్యులను గెలిపించాలని శరత్ కుమార్ చెప్పుకొచ్చారు.
అయితే శరత్ కుమార్ (Sarathkumar) ఇచ్చిన హామీపై ఎక్కువమంది విమర్శలు చేస్తున్నారు. అధికారంలోకి రావడానికి అడ్డదారులు తొక్కవద్దని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఈ కామెంట్లపై శరత్ కుమార్ ఏ విధంగా రియాక్ట్ అవుతారో చూడాల్సి ఉంది.
మేమ్ ఫేమస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సత్తిగాని రెండెకరాలు సినిమా రివ్యూ & రేటింగ్!
మళ్ళీ పెళ్లి సినిమా రివ్యూ & రేటింగ్!
‘డాడీ’ తో పాటు చిరు – శరత్ కుమార్ కలిసి నటించిన సినిమాల లిస్ట్..!