‘సర్దార్’ ఇంటర్వెల్ బ్యాంగ్ అదిరిందట!

పవన్ కళ్యాణ్ ‘సర్దార్’ సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా ఉన్నాయి. దీనికి తగ్గట్లుగానే పవన్ ప్రతి విషయాన్ని దగ్గర ఉండి చూసుకుంటూ.. ఆడియన్స్ కు కనెక్ట్ అయ్యేలా సినిమా చేయడానికి ప్రయతిస్తున్నాడు. రీసెంట్ గా ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకొని యు/ఏ సర్టిఫికేట్ ను పొందింది. ‘సర్దార్’ ఇన్ సైడ్ టాక్ అంటూ కొన్ని విషయాలు బయటకు
వచ్చాయి. ఈ సినిమా పవన్ కళ్యాన్ వన్ మ్యాన్ షో అట. తన యాక్షన్ సీక్వెన్సెస్ తో పవన్ అదరగొట్టాడట. సినిమాలో
మెయిన్ హైలైట్ ఇంటర్వెల్ బ్యాంగ్ అని తెలుస్తోంది. ఆ సమయంలో వచ్చే ‘ఆడు ఎవడన్నా.. ఈడు ఎవడన్నా’ అనే పాట
సినిమాను నెక్స్ట్ లెవెల్ కు తీసుకువెళ్ళే విధంగా ఉంటుందని సమాచారం. సెకండ్ హాఫ్ లో కూడా స్క్రీన్ ప్లే ఫాస్ట్ గా అందరికీ కనెక్ట్ అయ్యే విధంగా ఉంటుందని టాక్.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus