‘సరిలేరు నీకెవ్వరు’ 13 డేస్ కలెక్షన్స్…!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన తాజా చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. దర్శకుడు అనిల్ రావిపూడి.. ఈ చిత్రంలో మహేష్ ను కంప్లీట్ మాస్ యాంగిల్ లో చూపించి ఆయన అభిమానుల్ని మాత్రమే కాదు మాస్ ప్రేక్షకుల్ని కూడా అలరిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం మహేష్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ అయిన ‘మహర్షి’ కలెక్షన్లను అధిగమించిన సంగతి తెలిసిందే. మరో రెండు రోజుల్లో ఈ చిత్రం ‘రంగస్థలం’ కలెక్షన్లను సైతం అధిగమించే దిశగా దూసుకుపోతుంది. అయితే ‘అల వైకుంఠ పురములో’ చిత్రానికి మంచి రివ్యూ లు రేటింగ్ లు రావడం.. రెండో రోజు నుండీ ఆ చిత్రానికి ఎక్కువ థియేటర్స్ ఇవ్వడంతో ‘సరిలేరు’ పని అయి పోయినట్టే అని అంతా అనుకున్నారు. కానీ ‘సరిలేరు’ జోరు ఏమాత్రం తగ్గలేదు. తక్కువ థియేటర్స్ మాత్రమే ఉన్నప్పటికీ ఈ చిత్రం బుకింగ్స్ సాలిడ్ గా ఉన్నాయి.

ఇక ఈ చిత్రం 13 రోజుల కలెక్షన్ల వివరాలు ఈ విధంగా ఉన్నాయి :

నైజాం 34.81 cr
సీడెడ్ 14.53 cr
ఉత్తరాంధ్ర 17.83 cr
ఈస్ట్ 10.50 cr
వెస్ట్ 6.87 cr
కృష్ణా 8.23cr
గుంటూరు 9.26 cr
నెల్లూరు  3.71 cr
ఏపీ+తెలంగాణ 105.74 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా 8.92 cr
ఓవర్సీస్ 11.49 cr
వరల్డ్ వైడ్ టోటల్ 126.15 cr (share)

ఇక ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రానికి 101 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిది. 7 రోజులకే బ్రేక్ ఈవెన్ సాధించిన 13 రోజులు పూర్తయ్యేసరికి 126.15 కోట్ల వరకూ షేర్ ను రాబట్టింది. నిన్న(గురువారం రోజున) కూడా ఈ చిత్రం 1.28 కోట్ల పైనే షేర్ ను రాబట్టింది. ఫుల్ రన్ లో ఈ చిత్రం 130 కోట్ల షేర్ మార్క్ ను అధిగమించే అవకాశాలు కూడా ఉన్నాయి. ఏమైనా మహేష్ బాబు తన 100 కోట్ల మార్కెట్ కు పూర్తి న్యాయం చేస్తున్నాడు అనే చెప్పాలి.

Click Here To Sarileru Neekevvaru Movie Review

డిస్కో రాజా సినిమా రివ్యూ & రేటింగ్!
సరిలేరు నీకెవ్వరు సినిమా రివ్యూ & రేటింగ్!
అల వైకుంఠపురములో సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus