‘సరిలేరు నీకెవ్వరు’ 12 డేస్ కలెక్షన్స్…!

  • January 23, 2020 / 04:11 PM IST

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన తాజా చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. దర్శకుడు అనిల్ రావిపూడి.. ఈ చిత్రంలో మహేష్ ను కంప్లీట్ మాస్ యాంగిల్ లో చూపించి ఆయన అభిమానుల్ని మాత్రమే కాదు మాస్ ప్రేక్షకుల్ని కూడా అలరిస్తున్నాడు. ఈ చిత్రానికి మౌత్ టాక్ బాగా వచ్చినప్పటికీ రేటింగ్ లు మాత్రం ఎందుకో ఎక్కువ పడలేదు. ఈ చిత్రాన్ని పర్ఫెక్ట్ సంక్రాంతి సినిమా అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. అయితే ‘అల వైకుంఠ పురములో’ చిత్రానికి మంచి రివ్యూ లు రేటింగ్ లు రావడం.. రెండో రోజు నుండీ ఆ చిత్రానికి ఎక్కువ థియేటర్స్ ఇవ్వడంతో ‘సరిలేరు’ పని అయి పోయినట్టే అని అంతా అనుకున్నారు. కానీ ‘సరిలేరు’ జోరు ఏమాత్రం తగ్గలేదు. తక్కువ థియేటర్స్ మాత్రమే ఉన్నప్పటికీ ఈ చిత్రం బుకింగ్స్ సాలిడ్ గా ఉన్నాయి.

ఇక ఈ చిత్రం 12 రోజుల కలెక్షన్ల వివరాలు ఈ విధంగా ఉన్నాయి :

నైజాం 34.29 cr
సీడెడ్ 14.44 cr
ఉత్తరాంధ్ర 17.61 cr
ఈస్ట్ 10.42 cr
వెస్ట్ 6.80 cr
కృష్ణా 8.18 cr
గుంటూరు 9.22 cr
నెల్లూరు 3.65 cr
ఏపీ+తెలంగాణ 104.61 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా 8.85 cr
ఓవర్సీస్ 11.41 cr
వరల్డ్ వైడ్ టోటల్ 124.87 cr (share)

ఇక ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రానికి 101 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిది. 7 రోజులకే బ్రేక్ ఈవెన్ సాధించిన 12 రోజులు పూర్తయ్యేసరికి 124.87 కోట్ల వరకూ షేర్ ను రాబట్టింది. ‘అల వైకుంఠపురములో’ చిత్రానికి సూపర్ హిట్ రిపోర్ట్స్ వచ్చినా.. దాంతో తక్కువ థియేటర్స్ మాత్రమే దక్కినా.. ఈ చిత్రం జోరు ఏమాత్రం తగ్గలేదు. బుధవారం వీక్ డే అయినప్పటికీ 1.78 కోట్ల పైనే షేర్ ను రాబట్టింది. ఈ చిత్రం మహేష్ కు హ్యాట్రిక్ హిట్ ఇవ్వడమే కాదు… నిన్నటితో ఈ చిత్రం 200 కోట్ల గ్రాస్ వసూళ్లను కూడా అందించింది. తొలిసారి మహేష్ ఈ ఫీట్ ను సాధించాడు. కేవలం 5 నెలల్లో సినిమాని పూర్తి చేసి… అది కూడా 2.75 రేటింగ్ తో.. మరోపక్క ‘అల వైకుంఠపురములో’ వంటి బ్లాక్ బస్టర్ ఉన్నా..ఈ ఫీట్ ను సాధించడం అంటే మాటలు కాదు.

Click Here To Sarileru Neekevvaru Movie Review

సరిలేరు నీకెవ్వరు సినిమా రివ్యూ & రేటింగ్!
అల వైకుంఠపురములో సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus