ఐటెమ్ సాంగ్ తో సరిలేరు నీకెవ్వరు షూటింగ్ ఫినిష్

సంక్రాంతి సినిమా పుంజులైన “సరిలేరు నీకెవ్వరు, అల వైకుంఠపురములో, ఎంత మంచివాడవురా” చిత్రాలు పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నాయి. “అల వైకుంఠపురములో” ప్యాచ్ వర్క్ మాత్రం మిగిలి ఉండగా.. “సరిలేరు నీకెవ్వరు” సినిమాకి మాత్రం ప్యాచ్ వర్క్ తోపాటు ఒక పాట కూడా పెండింగ్ ఉంది. మహేశ్ బాబు మిల్క్ వైట్ బ్యూటీ తమన్నాల కాంబినేషన్ లో చిత్రీకరించాల్సిన “ఐటెమ్ సాంగ్” షూటింగ్ మాత్రం ఇంకా పూర్తవ్వలేదు. ఆల్రెడీ ఈ సాంగ్ కోసం అన్నపూర్ణ 7 ఎకర్స్ లో స్పెషల్ సెట్ కూడా వేశారు.

ఈ పాట చిత్రీకరణ ఒక రెండ్రోజుల్లో పూర్తి చేసి.. ప్యాచ్ వర్క్ ఫినిష్ చేయాలని అనిల్ రావిపూడి ప్లాన్ చేస్తున్నాడు. అయితే.. ప్లానింగ్ ప్రకారం షూటింగ్ జరగకపోతుండడం అనిల్ ని టెన్షన్ కి గురి చేస్తుంది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఎంత వేగంగా జరుగుతున్నప్పటికీ.. సినిమా రిలీజ్ కి సరిగ్గా నెల రోజులు ఉండగా ప్రమోషన్స్ కంటే షూటింగ్ కే ఎక్కువ సమయం కేటాయిస్తుండడం అనిల్ టెన్షన్ కి రీజన్.

24 గంటల్లో హైయెస్ట్ వ్యూస్ అండ్ లైక్స్ సాధించిన లిరికల్ సాంగ్స్ ఇవే!
30 సౌత్ ఇండియన్ హీరోయిన్లు మరియు వారి చైల్డ్ హుడ్ పిక్స్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus