నాని (Nani) – వివేక్ ఆత్రేయ (Vivek Athreya) కాంబినేషన్లో ‘అంటే సుందరానికీ!’ (Ante Sundaraniki) తర్వాత రూపొందిన చిత్రం ‘సరిపోదా శనివారం’ (Saripodhaa Sanivaaram) . డీవీవీ దానయ్య (D. V. V. Danayya) నిర్మాణంలో రూపొందిన ఈ చిత్రం కంప్లీట్ యాక్షన్ ఎలిమెంట్స్ తో రూపొందింది. ప్రియాంక అరుళ్ మోహన్ (Priyanka Mohan) హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంలో ఎస్.జె.సూర్య (SJ Suryah) పవర్ఫుల్ విలన్ గా నటించాడు. టీజర్, ట్రైలర్స్.. ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇక ఆగస్టు 29న రిలీజ్ అయిన ఈ సినిమాకి (Saripodhaa Sanivaaram) మొదటి రోజు పాజిటివ్ టాక్ వచ్చింది.
Saripodhaa Sanivaaram Collections
దీంతో ఓపెనింగ్స్ బాగా వచ్చాయి.భారీ వర్షాలు కలెక్షన్స్ పై ప్రభావం చూపినప్పటికీ.. మొత్తంగా పర్వాలేదు అనిపించింది.8వ రోజు,9వ రోజు కూడా ఈ సినిమా పర్వాలేదు అనిపించింది.ఒకసారి (Saripodhaa Sanivaaram) 9 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే :
‘సరిపోదా శనివారం’ (Saripodhaa Sanivaaram) చిత్రానికి రూ.44.5 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.45 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. 9 రోజుల్లో ఈ సినిమా రూ.38.44 కోట్ల షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కి మరో రూ.6.56(కరెక్టెడ్) కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది.