బిగ్ బాస్ సీజన్ 8 (తెలుగు) (Bigg Boss 8 Telugu) రియాలిటీ షో ఈ మధ్యనే గ్రాండ్ గా స్టార్ట్ అయ్యింది. ‘బిగ్ బాస్ 7’…లానే ఈ సీజన్ కూడా 14 మంది కంటెస్టెంట్స్…తోనే మొదలవ్వడం అనేది విశేషంగా చెప్పుకోవాలి. హౌస్లోకి వెళ్లే ముందే కంటెస్టెంట్స్ లో ఉత్సాహాన్ని నింపాడు నాగార్జున. ఈసారి ఇద్దరిద్దరుగా .. అంటే బడ్డీస్ తో కంటెస్టెంట్లు హౌస్లోకి ఎంట్రీ ఇచ్చారు.మొదటి రోజు అందరూ బాగానే ఉన్నారు.
Bigg Boss 8 Telugu
కానీ తర్వాత రోజు ఎప్పటిలానే కిచెన్లో గొడవలు స్టార్ట్ అయ్యాయి. నామినేషన్స్ లో కూడా కిచెన్ లో చోటు చేసుకున్న వ్యవహారాలతోనే ఒకరినొకరు నామినేట్ చేసుకున్నారు కంటెస్టెంట్లు. ఈ క్రమంలో కామన్ మెన్ మణికంఠ చేసిన ఎమోషనల్ కామెంట్స్ రెండు రోజుల నుండి వైరల్ అవుతూనే ఉన్నాయి. ఈ విషయాలు పక్కన పెట్టేస్తే.. ‘బిగ్ బాస్ 8’ (Bigg Boss 8 Telugu) కంటెస్టెంట్స్ పారితోషికాలు ఈసారి ఎలా ఉన్నాయో తెలుసుకుందాం రండి :
మొదటి కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చిన యష్మి గౌడ బుల్లితెర ప్రేక్షకులకి సుపరిచితమే. పలు సీరియల్స్ ద్వారా పాపులర్ అయిన ఈమె .. ‘బిగ్ బాస్ 8’ కోసం.. ఒక్క వారానికి గాను రూ.2.5 లక్షలు పారితోషికంగా అందుకుంటుందట.
2) నిఖిల్ :
కన్నడ సినిమాల్లో హీరోగా నటించిన నిఖిల్.. తెలుగు ప్రేక్షకులకి పలు సీరియల్స్ ద్వారా సుపరిచితమే. రెండో కంటెస్టెంట్ గా హౌస్లోకి ఎంట్రీ ఇచ్చిన ఇతను ప్రస్తుతం కూల్ గా గేమ్ ఆడుతున్నాడు. ఇక ఇతని పారితోషికం విషయానికి వస్తే.. ఒక్కో వారానికి గాను రూ.3 లక్షలు అందుకుంటున్నాడట.
3) అభయ్ నవీన్ :
‘పెళ్ళిచూపులు’ వంటి సినిమాల్లో నటించిన ఇతను ‘రామన్న యూత్’ వంటి సినిమాకి డైరెక్షన్ కూడా చేశాడు. బిగ్ బాస్ కోసం ఇతను ఒక్కో వారానికి గాను రూ.2 లక్షలు అందుకుంటున్నాడట.
4) ప్రేరణ :
‘రంగనాయకి’ తో పాటు పలు సీరియల్స్ ద్వారా పాపులర్ అయిన ప్రేరణ 4వ కంటెస్టెంట్ గా హౌస్లో ఎంట్రీ ఇచ్చింది. ఈమె పారితోషికం విషయానికి వస్తే.. ఒక్కో వారానికి గాను రూ.2.5 లక్షలు అందుకుంటుందట.
5) ఆదిత్య ఓం :
‘లాహిరి లాహిరి లాహిరిలో’ ‘ధనలక్ష్మి ఐ లవ్ యు’ చిత్రాలతో పాపులర్ అయిన ఇతను 5వ కంటెస్టెంట్ గా హౌస్లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇక ఒక్కో వారానికి గాను ఇతను రూ.3 లక్షలు చెల్లించనున్నారట బిగ్ బాస్ యాజమాన్యం.
6) సోనియా ఆకుల :
రాంగోపాల్ వర్మ డైరెక్ట్ చేసిన ‘దిశ’ సినిమాతో నటిగా ఎంట్రీ ఇచ్చింది. ఇక 6వ కంటెస్టెంట్ గా హౌస్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈమె ఒక్కో వారానికి గాను రూ.1.7 లక్షలు అందుకుంటున్నట్టు తెలుస్తుంది.
7) బెజవాడ బేబక్క :
సోషల్ మీడియా సింగర్, యాంకర్ అయినటువంటి బెజవాడ బేబక్క అలియాస్ మధు నెక్కంటి 7వ కంటెస్టెంట్ గా హౌస్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈమె వారానికి రూ.1.3 లక్షలు బిగ్ బాస్ వారి నుండి అందుకోనుందని తెలుస్తుంది.
8) శేఖర్ బాషా :
‘ఆర్.జె’ కమ్ యాంకర్..గా ప్రేక్షకులకు పరిచయమైన శేఖర్ బాషా బిగ్ బాస్ 8 కి 8వ కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చాడు. ఇతను ఈ షోలో పార్టిసిపేట్ చేస్తున్నందుకు.. ఒక్కో వారానికి గాను రూ.2.3 లక్షలు అందుకోనున్నట్టు సమాచారం.
9) కిరాక్ సీత :
‘బేబీ’ సినిమాతో పాపులర్ అయిన ‘కిరాక్ సీత’ 9వ కంటెస్టెంట్ గా హౌస్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ షోలో పాల్గొంటున్నందుకు ఆమె ఒక్కో వారానికి గాను రూ.2.20 లక్షలు అందుకోనుందట.
10) నాగ మణికంఠ :
కామన్ మెన్ గా.. 10వ కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చిన ఇతను.. చిన్న పిల్లాడిలా ప్రతిసారి ఏడుస్తూ కనిపిస్తున్నాడు. ఇక ‘బిగ్ బాస్ 8’ కోసం అతను రూ.1.25 కోట్లు పారితోషికం అందుకుంటున్నట్టు వినికిడి.
11) పృథ్వీరాజ్ :
ఈ సీజన్లో 11వ కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చిన ఇతను.. ఈ షో కోసం ఒక్కో వారానికి గాను రూ.1.5 లక్షలు పారితోషికం అందుకోనున్నట్టు సమాచారం.
12) విష్ణు ప్రియ :
యాంకర్ గా, నటిగా పాపులర్ అయిన ఈ బ్యూటీ, సోషల్ మీడియాలో చేసే గ్లామర్ షోతో ఇంకా హాట్ టాపిక్ అయ్యింది. ఇక బిగ్ బాస్ 8 కోసం ఆమె ఒక్కో వారానికి గాను రూ.3.7 లక్షలు పారితోషికంగా తీసుకుంటుందట.
13) నైనిక :
‘ఢీ’ షో ద్వారా పాపులర్ అయిన ఈమె 13వ కంటెస్టెంట్ గా హౌస్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇక ఈ షోలో పాల్గొంటున్నందుకు ఒక్కో వారానికి గాను రూ.2.3 లక్షలు పారితోషికంగా అందుకోనుందట.
14) నబీల్ అఫ్రిది :
వరంగల్ కి చెందిన యూట్యూబర్ గా ఫేమస్ అయిన ఇతను 14 వ కంటెస్టెంట్ గా హౌస్లోకి ఎంట్రీ ఇచ్చాడు. హౌస్లో ఇతను ఒక్కో వారానికి గాను రూ.1.7 లక్షలు పారితోషికంగా అందుకోనున్నట్టు సమాచారం.