మురగదాస్ దర్శకత్వంలో హీరో విజయ్ నటించిన సర్కార్ సినిమా రిలీజై బాక్సాఫీస్ దగ్గర మంచి కలెక్షన్లు రాబట్టింది. అయితే ఈ సినిమాలో కొన్ని సన్నివేశాలు దివంగత ముఖ్యమంత్రి జయలలిత ప్రతిష్ట ని దెబ్బతీసేలా, ప్రభుత్వ పథకాలను కించపరిచేవిధంగా ఉన్నాయంటూ కొందరు సినిమాకి వ్యతిరేకంగా మాట్లాడటంతో దర్శక, నిర్మాతలు సినిమాలోని కొన్ని సన్నివేశాలను తొలగించారు. ఇక ఇక్కడితో ఈ వివాదం చల్లారింది అనుకుంటే ఇప్పుడు మళ్ళీ ఇంకో వార్త డైరెక్టర్ మురగదాస్ ని చాలా ఇబ్బందిపెడుతుందంటా.
సర్కార్ సినిమాలో కొన్ని సన్నివేశాలను తీసివేసినప్పటికీ కొందరు మాత్రం డైరెక్టర్ మురగదాస్ అందరి ముందు క్షమాపణలు కోరాలని, మళ్ళీ ఇలా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉండే సినిమాలు తీయొద్దని ఒక హామీ పత్రం రాసి ఇవ్వాల్సిందే అంటూ పట్టుబడుతున్నారంటా. ఈ విషయం గురించి మురగదాస్ లాయర్ ని అడుగగా, మురగదాస్ తో ఒకసారి చర్చించిన తరువాత ఏదో ఒక నిర్ణయానికి వస్తామని చెప్పాడట. మరి ఇలా వస్తున్న వార్తలకి మురగదాస్ ఎలా స్పందిస్తాడో చూడాలి.