తమిళ హీరో విజయ్ ఎప్పటి నుంచో పాగా వేయాలని చూస్తున్నారు. రజినీకాంత్, కమల హాసన్, సూర్య మాదిరిగా అతని చిత్రాలు తమిళంలో మాదిరిగా తెలుగులోనూ కలక్షన్స్ సాధించాలని ఆశిస్తున్నారు. కానీ కుదరడం లేదు. అతని సినిమా రీమేక్ చేస్తే బ్లాక్ బస్టర్ అవుతుంది కానీ.. డబ్బింగ్ చేస్తే వసూళ్లు రాబట్టలేకపోతోంది. ఆ లోటుని “అదిరింది” సినిమా తీర్చింది. మెర్సల్ మూవీ తెలుగులోను మంచి కలక్షన్స్ రాబట్టింది. ఇంకా భారీ హిట్ ని సర్కార్ తో అందుకోబోతున్నారు. మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా టీజర్ రికార్డ్స్ నెలకొల్పింది. దీంతో అంచనాలు డబల్ అయ్యాయి. ప్రీ రిలీజ్ బిజినెస్ అదిరిపోయింది. తమిళనాడు లో 80కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. తెలుగు వెర్షన్ హక్కుళ్లను 7కోట్ల కు ప్రముఖ నిర్మాత అశోక్ వల్లభనేని దక్కించుకున్నారు.
ఈ చిత్రం తెలంగాణ ,ఆంధ్రాలో బ్రేక్ ఈవెన్ కావాలంటే 7.5 కోట్ల షేర్ వసూళ్లను రాబట్టాలి. తమిళంలో 80 కోట్లకి పైనా షేర్ రాబట్టాల్సి ఉంటుంది. సినిమా హిట్ టాక్ వస్తే ఈ మొత్తం రాబట్టడం తేలికేనని కోలీవుడ్ వర్గాలు తెలిపాయి. మరి తెలుగులోనే ఏ మాత్రం వసూలు చేస్తుందోనని అందరూ ఎదురు చూస్తున్నారు. సర్కార్ మూవీ నిన్నటి వరకు కోర్టు వివాదంలో ఉన్నింది.. ఆ వివాదం నేడు ముగిసిపోయింది. రచయిత వరుణ్ రాజేంద్రన్ కి టైటిల్ కార్డు ఇస్తామని మురుగదాస్ చెప్పడంతో సినిమా ముందుగా ప్రకటించినట్లుగా నవంబర్ 6న రెండు భాషల్లో గ్రాండ్ గా రిలీజ్ కానుంది.